అమెరికాలోని మినియాపోలిస్ నగరములో, తానా సంస్థ ఆధ్వర్యంలో తానా రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని అధ్యక్షతన తెలుగు పాఠశాల పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి పుస్తకాలు పంపిణి చేసారు.
ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు బాషా తియ్యదనం, తెలుగుజాతి గొప్పతనాన్ని అమెరికాలో రుచి చూపించారన్నారు. భాషను భావితరాలకు అందజేసేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భాషను చంపే తరంగా మనం మిగలకూడదు. ఇప్పటికే పాలకుల అనాలోచిత నిర్ణయాలు తెలుగుభాషకు శాపంగా మారాయి. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు భాషను అమెరికాలోని తెలుగువారు బ్రతికిస్తున్నారు. ఏ జాతి అయితే తమ మాతృభాషను సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ఒక జాతి అస్థిత్వాన్ని ప్రత్యేకతను చాటి చెప్పేది మాతృభాషేనన్న విషయాన్నీ గుర్తించాలన్నారు.
సాయి బొల్లినేని మాట్లాడుతూ బాషా ఒక సాంస్కృతిక వారధి. తరాల మధ్య అంతరం రాకుండా మాతృబాష కాపాడుతుందన్నారు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని మరువకూడదన్నారు. బాష మానవసంబంధాలు పెంపొందించి సమాజాన్ని విడిపోకుండా కాపలా కాస్తుందన్నారు.
ఈ సందర్భంగా తానా నార్త్ సెంట్రల్ పాఠశాలకు ప్రోత్సాహం అందిస్తున్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా పాఠశాల చైర్ నాగరాజు నలజుల కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
అనంతరం పిల్లలు తెలుగులో చక్కటి గేయాలు, పద్యాలు పాడి ప్రేక్షకులను అలరించారన్నారు.
ఈ కార్యక్రమంలో తానా పాఠశాల కోఆర్డినేటర్ మాలెంపాటి నాగరాజు, అరవపల్లి వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.