Last rites of #LanceNaik #SaiTeja, who lost his life in the #TamilNaduChopperCrash will be performed today in #EguvaRegada village of #Kurabalakota
of #AndhraPradesh #Chittoor . pic.twitter.com/GArDGNqG9r— Repeeatuu (@repeeatuu) December 12, 2021
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు అసువులు బాసిన ఆంధ్రుడు… పారా కమాండో సాయితేజ భౌతికకాయం ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తరలించారు. చిత్తూరు జిల్లా సరిహద్దులో చీకల బైలు చెక్ పోస్టు…వలసపల్లి మీదుగా..ఎగువరేగడకు రోడ్డు మార్గంలో తరలించారు.
సుమారు 30 కి.మీటర్ల దూరం ఉన్న రోడ్డుకిరువైపులా ప్రజలు బారులు తీరారు. వీరుడికి చివరికంటా తోడుంటూ ఘనంగా పూలు జల్లుతూ వీడ్కోలు పలికారు.
విషాదకరం ఏంటంటే… పాపం వీరుడు సాయితేజ మృతదేహం గుర్తుపట్టడానికి కూడా వీలవకపోతే డీఎన్ఏ టెస్టుల ఆధారంగా.. సాయితేజ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆస్పత్రిలో ఆర్మీ అధికారులు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత.. ఢిల్లీ నుంచి సాయితేజ మృతదేహాన్ని కోయంబత్తూరు ఎయిర్‌బేస్‌కు తరలించారు.
అక్కడి నుంచి బెంగళూరుకు ఎయిర్ లిఫ్ట్ చేసి.. ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఉంచారు. అక్కడ.. సైనికాధికారులు శ్రధ్ధాంజలి ఘటించి.. సెల్యూట్ చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తరలించారు.