లంబసింగి …రిలీజ్‌కు ముందే టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తి రేపిన సినిమా. బిగ్‌బాస్ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తన సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సమర్పకులుగా ఉంటూ కళ్యాణ్ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. నవీన్ గాంధీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాతో భరత్ రాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకు అంచనాలు అందుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
ఓ కానిస్టేబుల్ వీరబాబు ( భరత్‌రాజ్) లంబసింగ్ ఊళ్లో పోస్టింగ్‌లో జాయిన్ అవుతాడు. బస్సు దిగాడో లేదో వెంటనే హరిత (దివి) ని చూడడం ప్రేమలో పడడం వెంటనే జరిగిపోతుంది. ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలవడంతో అసలు ట్విస్ట్ ఉంటుంది. ఆ ఊళ్లో నక్సలైట్లుగా ఉన్న వారిలో చాలా మందికి ప్రభుత్వం షెల్టర్ ఇస్తుంటుంది. అయితే అలా పునరావాసం ఉన్న వాళ్లతో పోలీసులు రోజు సంతకాలు చేయించుకోవాలి. ఈ పని వీరబాబు చూస్తుంటారు. ఈ క్రమంలోనే హరితను లవ్‌లో పడేసేందుకు వీరబాబు రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించే క్రమంలో ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఆమె ఆ ఊళ్లోనే నర్సుగా పని చేస్తూ ఉంటుంది.
ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకు మరింత దగ్గరైన వీరబాబు ఆ టైంలో తన ప్రేమను హరితకు చెప్పాలనుకుంటాడు. వీరబాబు డేర్ చేసి హరితకు తన ప్రేమ చెప్పినా ఆమె ఒప్పుకోదు. నిరాశలో ఉన్న వీరబాబుకు ఓ రోజు షాక్ తగులుతుంది. డ్యూటీలో ఉండగా కొందరు పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి అక్కడ ఉన్న ఆయుధాలు పట్టుకుపోతారు. ఆ దాడిలో గాయపడిన వీరబాబుకు పెద్ద షాక్ ఎదురవుతుంది. అసలు హరిత ఎవరు ? ఆమె వీరబాబు ప్రేమ ఎందుకు నిరాకరించింది ? ఆమె గతం ఏంటి ? మరి వీరబాబు , హరిత ఒక్కటయ్యారా ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
విశాఖ ఏజెన్సీలో చలి ఎక్కువుగా ఉండే లంబసింగి పేరుతో తెరకెక్కి ఈ సినిమా మంచి కథ. ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఫస్టాఫ్‌లో సినిమా కాస్త స్లో అయినట్టు ఉన్నా తర్వాత కథలో స్పీడప్ పెరుగుతుంది. హీరోయిన్ పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. కొన్ని వన్ లైన్ వర్డ్స్ బాగా పేలాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సినిమా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ మాత్రం స్టార్టింగ్ నుంచే ఇంట్రస్టింగ్‌గా నడిపించాడు దర్శకుడు.
ప్రేక్షకుడు ఎక్కడా ఆలోచించే టైం లేకుండా కథ పరుగులు పెడుతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే సెకండాఫ్‌లో చాలా పగడ్బందీగా రాసుకున్నాడు. వీరబాబు, రాజు గారు క్యారెక్టర్లతో కామెడీ పండించిన తీరు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. క్లైమాక్స్ హార్ట్ టచ్చింగ్‌గా ఉండి ప్రేక్షకుడు ఆ ఫీల్ లో బయటకు వస్తాడు. నటీనటుల్లో హీరోయిన్ దివిని బిగ్‌బాస్ నుంచి కూడా చాలా మంది దర్శకులు గ్లామర్ కోసమే వాడుతున్నారు. ఆమెలో ఉన్న ఓ నేచురల్ స్టార్‌ను బయటకు తీయడం లేదు. ఈ లంబసింగి సినిమాలో ఆమె పాత్ర ఆమె కెరీర్లోనే గుర్తుండి పోయే పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుంది. హరిత పాత్రలో ఆమె అలా ఒదిగిపోయింది. ఆమె పాత్రకు దర్శకుడు నవీన్ గాంధీ రాసుకున్న ట్విస్టులు కూడా అదిరిపోయాయి.
ఈ టైప్ పాత్రలు మరో ఒకటి రెండుపడితే దివి కెరీర్ టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు తిరుగులేకుండా కంటిన్యూ అవుతుంది. ఇక హీరో భరత్ వీరబాబు పాత్రలో నేచురల్‌గా నటించాడు అనేకంటే ఈ కథకు కూడా అంతే స్కోప్ ఉంది. భరత్ ఎమోషనల్ పెర్పామెన్స్ బాగుంది. కామెడీతో పాటు ఎమోషనల్ అన్నీ విధాలుగా ఆకట్టుకున్నాడు. మిగిలిన నటుల్లో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
దర్శకుడు నవీన్ గాంధీ ఓ నేచురలిస్టిక్ కథతో లంబసింగి సినిమాను తెరకెక్కించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. 2.02 గంటల ఈ సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు లంబసింగి ప్రపంచంలోకి వెళ్లిపోయాడు. సినిమాకు ధృవన్ అందించిన నేపథ్య సంగీతం మేజర్ హైలెట్. ఇటీవల కాలంలో ఓ చిన్న సినిమాకు ఇంత మంచి పాటలు కూడా లేవు. ప్రతి పాట ఒక్కసారి వింటేనే మనసును తాకేలా ఉంది. బుజ్జి.కె సినిమాటోగ్రఫీ కథకు తగినట్టుగా సహజంగా ఉంది.
రన్ టైం 2 గంటలే కావడంతో ఎక్కడా బోరింగ్ ఉండదు. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి కూడా తన పనితనంతో మెప్పించాడు. నిర్మాణ విలువలు సినిమా కథకు తగినట్టుగా రాజీలేకుండా ఉన్నాయి.
ఫైనల్‌గా…
నేచురల్‌గా మనస్సును తాకే కథ.. రీసెంట్ టైమ్స్‌లో మనస్సును మెలిపేట్టే సినిమా లంబసింగి
రేటింగ్ : 2. 5 / 5