సదరన్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన ‘ధీమ్ తానా’ పోటీలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగాయి.
మొట్టమొదట గా జ్యోతి ప్రజ్వలన తో పార్రంభం అయిన పోటీలు క్లాసికల్ సింగింగ్ , ఫిల్మీ సింగింగ్, క్లాసికల్ డాన్స్, ఫిల్మీ డాన్స్, బ్యూటీ మరియు చిలక గోరింకా పోటీలతో సాయంత్రం వరకు సాగాయి.
ఈ పోటీలు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అండ్ అడల్ట్స్ క్యాటగిరి లో జరగడం విశేషం.
ఇందులో విన్నెర్స్, 1st రన్నర్స్ లో గెలిచిన వాళ్ళు ఫిలడెల్ఫియా లో జరిగే 23వ ‘తానా’ మహాసభల్లో July 8th and 9th లో పాల్గొని ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అని నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీలలో నాలుగు సంవత్సరాల క్రియ కల్యాణ ప్రత్యేక ఆకర్షణగ నిలవడం గమనార్హం.
‘తానా’ రీజనల్ కోఆర్డినేటర్ (సదరన్ కాలిఫోర్నియా) ప్రతాప్ చెరుకూరి మాట్లాడుతూ ఈ పోటీలు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అని కొనియాడారు.
హేమ కుమార్ గొట్టి (‘తానా’ టీం స్క్వేర్ చైర్, సదరన్ కాలిఫోర్నియా) మాట్లాడుతూ ‘ధీమ్ తానా’ సదరన్ కాలిఫోర్నియా విజేతలు ఫిలడెల్ఫియా లో జరిగే ఫైనల్స్ లో కూడా విజేతగా నిలుస్తారు అని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ‘తానా’ సదరన్ కాలిఫోర్నియా ఎక్సిక్యూటివ్ టీం వేణుగోపాల్ జెట్టి, చంద్రశేఖర్ గుత్తికొండ, ప్రతాప్ జొన్నాదుల, ప్రతాప్ మేదరమెట్ల, హరి నేతి, భాస్కర్ రెడ్డి వళ్ళు, రాజేంద్ర సురపురం, నేతాజీ గుర్రం, మొహమ్మద్ రఫీ దూదేకుల, వివేక్ ఇమ్మనేని పాల్గొన్నారు.