వైఎస్ ఆత్మ ఘోషిస్తోంది! ఏపీలో పాలన ఏమీ బాగోలేదని.. స్పష్టం చేస్తోంది. హీన దీన స్థితిలో సీఎం జగన్ పాలన చేస్తున్నడని కూడా ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తు న్నాయి. ఇంతకీ `వైఎస్ ఆత్మ` అంటే.. కేవీపీ రామచంద్రరావు. వైఎస్ హయాంలో చక్రం తిప్పిన సీనియర్ కాంగ్రెస్నేత. అయితే.. ఆయన ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై టార్గెట్ చేస్తూ.. కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో సీఎం జగన్ పాలన ఏమీ బాగోలేదని అన్నారు. అంతేకాదు.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కనీ సం దారి చూపించే పరిస్థితిలోనూ కూడా జగన్ లేరని దుయ్యబట్టారు. విజయవాడలో జరిగిన పీసీసీ విస్తృ తస్థాయి సమావేశంలో కేవీపీ ఏపీ సర్కారు తీరును ఎండగట్టారు. ముఖ్యంగా కేంద్రం మెడలు వంటి ప్రత్యే క హోదా సాధిస్తామని.. ఎన్నికలకు ముందు చెప్పిన సీఎం జగన్..తర్వాత దీనిని అటకెక్కించారని అన్నారు.
గతంలో చంద్రబాబు హయాంలోనే ప్రత్యేక హోదా తీసుకురావాల్సి ఉందని.. అయితే.. దీనిని ఆయన అటకెక్కించారని.. తర్వాత.. పవన్ కూడా బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ దీనిని ప్రస్తావించడం లేదని అన్నా రు. ఇక, ఇప్పుడు జగన్ అసలు దీనిని పట్టించుకోవడమే మానేశారని అన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృ ద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ సీఎం జగన్ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
విభజన హామీల కోసం ప్రభుత్వం నుంచి పోరాటం లేదని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన విధానంలో వెళ్లటం లేదని కేవీపీ చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం సిద్దపడిందన్నారు. అయినా, అడ్డుకొనే ప్రయత్నాలు జరగటం లేదని ఆవేనద వ్యక్తం చేసారు. నాడు వైఎస్సార్ రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని గుర్తు చేసారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం, రాహుల్ ను ప్రధాని చేయటం ఆ రెండు లక్ష్యాలుగా కేవీపీ గుర్తు చేసారు.
కనీసం ఈ రెండింటిలో పోలవరాన్ని కూడా జగన్ ప్రాధాన్యం అంశంగా భావించడం లేదని అన్నారు. మొత్తంగా కేవీపీ.. జగన్ సర్కారుపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డం గమనార్హం. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఎన్నికలకు ముందు.. సీఎం జగన్ కు సహకరించిన రెడ్డి సామాజిక వర్గానికి పరోక్షంగా కేవీపీ సహకారంఅందించారనే వాదన ఉండడమే! ఇప్పుడు అదేవైఎస్ ఆత్మ జగన్ పాలనపై ఘోషిస్తుండడం గమనార్హం.