దశాబ్దాల నుండి విభిన్న వర్గాలు గా పార్టీ కోసం పనిచేస్తున్న ఎన్ఆర్ఐ తెలుగుదేశం కువైట్ , ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్ , నవ్యాంధ్ర తెలుగుదేశం కువైట్ , తెలుగు యువత, NRI తెలుగుదేశం కువైట్ బిసి విభాగం, NRI తెలుగుదేశం కువైట్ ముస్లిం మైనారిటీ విభాగం మరియు వివిద తెలుగుదేశం మరియి నందమూరి అనుబంధ సంస్థలు కలసి ఒకే ఎజండాతో పనియాలని,కలసికట్టుగా పార్టీ విజయమే లక్షంగా పని చేయాలని 4th డిశంబరు 2020 శుక్రవారం అబు హలీఫాలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. పార్టీ అదిష్టానం కూడా అభినందిస్తూ లక్ష్యాలపై దిశా నిర్దేశం చేసిన విషయాన్ని సభ్యులకు వివరించారు.
తెలుగుదేశం పార్టీ సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలు:–
స్థానిక సంస్థల ఎన్నికలకు తమ ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులతో క్షేత్ర స్థాయిలో పని చేసేలా ప్రణాళికలు. పార్లమెంటు, మండల, డివిజన్ వారీ నాయకుల సమన్వయం తో పని చేయాలని నిర్ణయం.
పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేసేలా, ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజల్లోకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అన్నీ వర్గాలు బేషరతుగా కలిసి పార్టీ విజయం కోసం పని చేయాలని నిర్ణయించాయి.
నియోజకవర్గ సమస్యలపై కూడా చట్ట సభల్లో మాట్లాడాలని ‘జూమ్ సమావేశాల’ ద్వార స్థానిక ప్రజ ప్రతినిదులకు విన్నవించాలి.
ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం, ప్రవాసాంధ్రుల సమస్యలపై పోరాటం చేసేలా కార్యక్రమాలు ఖరారు చేసుకోని, పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేయాలని బలరామ్ నాయుడు తెలిపారు.
గ్రామ , మండల, నియోజకవర్గ స్థాయిల్లో స్థానిక నేతల సమన్మయ సమావేశాల ద్వారా (జూమ్ సమేవేశాలతో) కేడర్‌కు భరోసా. ఇక నుంచి పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తానని వెంకట్ కోడూరి తెలియ పరిచారు
తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నాం.ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏఏ వర్గాలు దూరమయ్యాయనేది తెలుసుకోని అటువంటి వర్గాలకు దగ్గరవడానికి మా వంతు కృషి చేసి స్థానిక ఎన్నికలలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని నాగేంద్ర బాబు అక్కిలి అన్నారు.
పార్టీ కోసం ప్రవాసాంధ్ర కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్నారు, అటువంటి కేడర్‌కు ఏ అవసరం వచ్చినా పార్టీ నిలబడాలని ఇటువంటి సమయంలో కేడర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి కూడా వుంది అదేవిదంగా అందరం కలసి త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో విజయం కోసం పనిచేద్దామని అని షేక్ రహంతుల్లా తెలియ చేశారు.
సమావేశంలో పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులు :-
‘ఉదయ్ ప్రకాష్, శ్రీనివాస చౌదరి , ముస్తాక్ ఖాన్ ,రాము యాదవ్ , కరీం టి , మోహన్ రాచూరి , షేక్ యం డి. అర్షద్ , భాస్కర్ నాయుడు మల్లరపు , మల్లికార్జున నాయుడు , బాష , బాబా సాహెబ్ , కదీర్ బాషా’
తమ ప్రసంగం లో ప్రధానంగా తమకు పదవుల కంటే పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి, ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి లో అగ్రగామిగ ఉండాలని తెలిపారు.