కువైట్ యన్.ఆర్.ఐ తెలుగుదేశం కమిటీ సభ్యులు పంచాయితీ ఎన్నికల బరిలో!

NRI
కువైట్ నుండి యన్.ఆర్.ఐ తెలుగుదేశం కమిటీ సభ్యులు స్థానిక సంస్థాగత ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. అందులో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాదర్ పల్లె నుండి  ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ మైనార్టీ విభాగం కార్యదర్శి టీ.అబ్దుల్ కరీమ్ గారి అక్కగారు షేక్ సెక్షున్ (ప్రెసిడెంట్ )  మరియు సతీమణి మహముదా( వైస్ ప్రెసిడెంట్ ) వీరు ఇరువురు ఈ రోజు 31/01/2021 ఆదివారం తెలుదేశం పార్టీ తరపన నామినేషన్ వేయడం జరిగినది.
ఈ సందర్బంగా 30/01/2021 రాత్రి ఆంధ్రరాష్ట్రానికి బయలు దేరిన టీ.అబ్దుల్ కరీం అండ్ టీమ్ వారికి, యన్.ఆర్.ఐ తెలుగుదేశం కమిటీ  బరోసా నింపి పంపించారు.ఈ సమావేశానికి  అద్యక్షులు వెంకట్ కోడూరి, ప్రముఖ  సీనియర్ నాయుకులు బలరామ్ నాయుడు దరూరి, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు అక్కిలి, జాయింట్ సెక్రెటరీ మోహన్ రాచూరి, మైనారిటీ సెల్ అద్యక్షులు రహమతుల్లా, ఉపద్యక్షులు ముష్తాక్ ఖాన్, కరీముల్లా టి . మహమ్మద్ కార్యదర్శి, సయ్యద్ అలీ, షెక్ హర్షద్ పాల్గొని సాగనంపడం జరిగినది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.