అదేంటి తమ ప్రయోజనాల కోసం ఏపీ ని ఏం చేయడానికి అయినా సిద్ధ పడే టీఆర్ఎస్ నేతలు ఏపీ రోడ్ల గురించి ఆలోచించడం ఏంటనుకుంటారా? చిన్న ట్విస్టుంది. హైదరాబాదు – విజయవాడ రోడ్డులో అధిక భాగంగా తెలంగాణలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విజయవాడ – హైదరాబాదు జాతీయ రహదారి అభివృద్ధి అయితే తెలంగాణకే మంచిది అన్న ఆలోచనతో కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు.
ప్రస్తుత ఆటంకాలు తొలగించి… రోడ్డును అభివృద్ధి పరిచేందుకు 500 కోట్లు కేటాయించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రికి కేటీ రామారావు లేఖ రాశారు. ఇది అత్యంత రద్దీ ఉండే రోడ్డు అని దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విజయవాడ జాతీయ రహదారిపై లెవెల్ జంక్షన్లు, సర్వీసు రోడ్డు సదుపాయాల్లేవు. దీని అభివృద్ధి కోసం ఇప్పటికే డీపీఆర్ కూడా తయారయ్యింది. నిధులు వస్తే పని వేగంగా పూర్తి అవుతుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
ఇది ఇరు రాష్ట్రాలకు మేలు చేస్తుందని, వ్యాపార పరంగా కూడా ఎంతో ఉపయోగకరమైనది అన్నారు. సూర్యపేట ను గేమ్ ఛేంజర్ గా మార్చే ఆలోచనలో కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే రెండింటి మధ్య బుల్లెట్ రైలు గురించి మాట్లాడిన కేటీఆర్… ఇపుడు రోడ్డు మార్గం అభవృద్ధి గురించి లేఖ రాశారు.