ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయో లేదో తెలీదు కానీ మంత్రి కేటీఆర్ మాత్రం ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంతా రబ్బిష్ అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే సంస్ధలు క్షమాపణలు చెబుతాయా అని నిలదీశారు. 2018లో ఎగ్జిట్ పోల్స్ తప్పు అయినట్లు చెబుతున్నారు. కేటీయార్ మాటలు చూస్తుంటేనే తానెంతటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో తెలిసిపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నది నూరుశాతం నిజమవ్వాలని ఏమీలేదు. నిజమవ్వటానికి ఎంత అవకాశముందో కాకపోవటానికి కూడా అంతే అవకాశముంది.
ఈ విషయం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న కేటీయార్ కు ఎవరు చెప్పాల్సిన పనిలేదు. అయినా ఎందుకింత అసహనంతో ఉన్నట్లు ? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన సంస్ధల్లో మెజారిటి కాంగ్రెస్ పార్టీదే అధికారమని తేల్చాయి కాబట్టి. దాదాపు 20 సంస్ధలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే అందులో సుమారు 17 సంస్ధలు కాంగ్రెస్ కే పట్టంకట్టాయి. అందుకనే కేటీయార్‌లో ఇంతటి అసహనం. ఎగ్జిట్ పోల్స్ నిజమైపోయి అధికారం ఎక్కడ దూరమవుతుందో అన్న ఆందోళనే కనబడుతోంది.
ఎవరు అధికారంలోకి వస్తారు ? ప్రతిపక్షంలో ఎవరుంటారనే విషయాన్ని నిర్ణయించేవి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్ధలుకావు. ఎగ్జిట్ పోల్స్ అన్నది జనాభిప్రాయాన్ని వెల్లడించే మార్గం మాత్రమే. ఇంతోటిదానికి కేటీయార్ ఇంతలా ఉలిక్కిపడాల్సిన అవసరమే లేదు. అయినా ఇంతలా మండిపోతున్నారంటేనే ఎగ్జిట్ పోల్స్ నిజమని కేటీయార్ కు తెలుసా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ జోస్యాలన్నీ నిజమవ్వాలని ఏమీలేదు. నిర్వహించే సంస్ధలు, వాటి క్రెడిబులిటి లాంటి అనేక అంశాల మీద ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు ఆధారపడుంటుంది.
అధికారంలో ఉన్న పార్టీ లేదా ఏదో ఒక పార్టీ మీడియా సంస్ధకు డబ్బులిచ్చి సర్వే చేయించుకుంటుంది. అప్పుడు ఆ సర్వే డబ్బులిచ్చి సర్వే చేయించుకున్న పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. అలాంటి సర్వేని లేదా సర్వేలను అనుమానించచ్చు. కానీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను చాలా సంస్ధలు నిర్వహించాయి. కాబట్టి వాటంతట అవే చేసుంటాయనటంలో సందేహంలేదు. ఆయా సంస్ధలు తీసుకున్న శాంపిల్స్ ను బట్టి వాటి క్రెడిబులిటి ఆధారపడుంటుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ జోస్యాల కన్నా కేటీయార్ ఫ్రస్ట్రేషన్‌లోనే విషయం తెలిసిపోతోంది.