టీఆర్ఎస్ పార్టీ ఎవరు కాదన్నా అవునన్నా ఒక కుటుంబ పార్టీ. కేవలం ఆంధ్ర బూచి వల్ల రెండు సార్లు అధికారం సాధించగలిగారు. ఆంధ్రా అనే పదంతో తెలంగాణ వాదం వాడుకుని తెలంగాన పార్టీగా ఎదిగారు. ఆ మాటల మాయాజాలన్ని తెలంగాణ ప్రజానీకం కూడా నమ్మింది. కానీ అది 2020 వరకు నడిచింది గానీ ఇకపై నడవదని తేలిపోయింది. దుబ్బాకే దానికి సూచిక. అందుకే ఇంతకాలం ఆంధ్రా వ్యతిరేక సెంటిమెంటును రగిలించి లబ్ధి పొందాలని చూసిన కేసీఆర్ పార్టీ… ఆ అస్త్రం ఇక పనిచేయదు అని రూటు మార్చింది.
తాజాగా ghmc ఎన్నికల్లో ఆంధ్రా అనుకూల సెంటిమెంటును రలిగించడం స్టార్ట్ చేశారు తండ్రీ కొడుకులు అయిన కేసీఆర్, కేటీఆర్. దీనికి కారణం ఇపుడు వారి ప్రత్యర్థి కాంగ్రెస్ కాకుండా బీజేపీ అవడమే. తెలంగాణలో టీఆర్ఎస్ పెద్దలు బీజేపీకి వణికిపోతున్నారు. అందుకే ఎన్నడూ లేని వినయం, వరాలు ప్రకటిస్తున్నారు. ఆంధ్రకు జరిగిన అన్యాయం గురించి సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కన్నీరు కార్చడం మొదలుపెట్టారు.
తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదన్నారు. తెలంగాణతో పాటు బీజేపీ ప్రభుత్వం, ఏపీకి కూడా ఏమీ చేయలేదన్నారు. ఏపీకి పిడికెడు మట్టి, చెంబు నీళ్లు తప్ప ఏమిచ్చారని ప్రశ్నించారు కేటీ రామారావు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మీటింగులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని డైలాగులు కొట్టినా ఏం చేశారు అన్నది ముఖ్యం అని కేటీఆర్ అన్నారు.
జగన్ ను గెలిపించడం ద్వారా ఏపీకి ఘోరమైన అన్యాయం చేసిన వ్యక్తి కేటీఆర్. జగన్ గెలిస్తేనే హైదరాబాదు నిలబడుతుందని, ఏపీ లో మళ్లీ చంద్రబాబు గెలిస్తే హైదరాబాదు రియల్ ఎస్టేట్ పడిపోతుందని వ్యూహం పన్ని జగన్ కి మద్దతు ఇచ్చారు. అక్కడ జగన్ గెలవడం కేసీఆర్ అవసరం. అలాంటి రాజకీయం నడిపిన కేటీఆర్ నేడు ఏపీ బాధ గురించి మాట్లాడుండటం ఆశ్చర్యమే. ఇచ్చే వాళ్లో లేదో తెలియదు గాని అప్పటి వంద కోట్ల హామీ గురించి తండ్రీకొడుకు మాట్లాడుతూనే ఉన్నారు. అపుడంటే లేదు. ఇపుడు ఏపీ కష్టాల్లో ఏపీకి ఆ వంద కోట్లు ఇపుడు ఇవ్వచ్చుగా. అట్లెట్టా! అదంతే.. ఆ వంద కోట్ల మాట అలా వాడేస్తుంటారంతే.