రాజకీయాల్లో యుక్తులు సహజం. నన్ను గెలిపించండి.. మీకు అది చేస్తాను. నన్ను గెలిపించండి.. మీకు ఇది చేస్తాను.. అని చెప్పుకోవడం నాయకుల లక్షణం. అంతేకాదు.. సిట్టింగు నాయకులైతే.. ఇప్పటి వరకు తాము చేసింది చూపిస్తారు. తాము చెప్పింది చూపిస్తారు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో యుక్తుల స్థానంలో కుయుక్తులు తెరమీదికి వస్తున్నాయి. ముఖ్యంగా టఫ్ అయిపోయిన నియోజకవర్గాల్లో వైరి పక్షం నాయకులు.. యుక్తుల స్థానంలో కుయుక్తులు , కుతంత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో వరుసగా విజయాలు దక్కించుకున్న కొడాలి నాని.. ఇప్పుడు ఆపశోపాలు పడుతున్నారు. ఎలా గెలవాలనే విషయం ఆయనకు అంతుచిక్కడం లేదు. అబివృద్ది గురించి చెబుదా మంటే.. 20 ఏళ్లలో మారని పరిస్థితి కనిపిస్తోంది. పోనీ.. వైసీపీ తరఫున చేసిన సంక్షేమం గురించి ఏకరువు పెడదామా అంటే.. అది కూడా.. సక్సెస్ కావడం లేదు. ఎందుకంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే.. అర్హులకు అందిస్తున్నారో.. అదే ఇక్కడ కూడా అమలవుతోంది.
పోనీ .. రోడ్డు వేయించానని.. పరిశ్రమలు తెచ్చానని చెప్పుకొనే అవకాశం ఉందా? అంటే.. కొడాలికి అంత లేదు. ఇది జనం మాట. దీంతో ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడమే బెటర్ అన్నట్టుగా ఆయన ఉన్నారు. సో.. మరి ఎలా గెలవాలి? ఇదే అంతు చిక్కని ప్రశ్న. అలాకాదు.. సైలెంట్‌గా ఉందాం.. ఎన్నికల వేళ ఏదో చేద్దాం.. అనుకుంటే.. అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ప్రత్యర్థి తనకంటే.. నాలుగాకులు ఎక్కువ చదివి.. నాలుగు రూకలు ఎక్కువ ఖర్చు పెట్టే నాయకుడు. సో.. ఏం చేయాలి?
ఇక్కడే కొడాలి తన మైండ్ గేమ్‌కు తెరదీశారు. కుయుక్తులు పన్నాడు. “ఎన్నారైలకు ఓటేస్తారా? ఈ సంప్రదాయం ఎక్కడైనా ఉందా? తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకదా! అక్కడ గెలిచిన ఎన్నారై.. బ్రిటన్ పారిపోయాడు. ఇప్పటి వరకు ముఖం చూపించలేదు“ అని యాంటీ ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు.. ఎన్నారైలను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల గెలిస్తే.. అమెరికా వెళ్లిపోతాడని.. ఐదేళ్ల వరకు కనిపించడని ప్రచారం చేస్తున్నారు. అంటే.. అన్ని అస్త్రాలు అయిపోయి.. ఈ కుయుక్తులకు తెరదీసి.. జనాల మైండ్ గేమ్‌తో ఆడుకునే దుష్ట సంప్రదాయానికి కొడాలి తెరదీశారన్నమాట. మరి జనాలుఏం చేస్తారో చూడాలి.