వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. అట్టడుగు వర్గాల వారి బ్యాంకు ఖాతాల కు నిధులు కూడా ఇచ్చింది. వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు ప్రసరించేలా కూడా చేసింది. దీనిని ఎవరూ కాదనడం లేదు. కానీ, క్షేత్రస్థాయిలో పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల విషయం ఏంటి? ఇదీ.. ఇప్పుడు ఎన్నిక లకు ముందు కీలకమైన గుడివాడ నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఇక్కడ ఏ ఇద్దరు కలుసుకున్నా.. బూతుల నేత కావాలా? అభివృద్ది ప్రదాత కావాలా? అనే చర్చించుకుంటున్నారు.
నిజమే, క్షేత్రస్థాయాలో గుడివాడలోని ఏ మండలానికి వెళ్లినా.. ఇదే చర్చ బహిరంగంగానే వినిపిస్తోంది. ఒకప్పుడు భయపడుతూ.. బాధపడుతూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించకుండా తమలోనే దాచుకున్న ఓటర్లు.. ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. దీనికి కారణం.. అభివృద్ధి మంత్రం పఠిస్తున్న టీడీపీ నాయకుడు, అభ్యర్థి ఎన్నారై వెనిగండ్ల రాము ఒకవైపు.. నిత్యం బూతులు, తిట్లు.. దూషణలు, సీఎం జగన్పై స్త్రోత్ర పాఠాలతో కాలం వెళ్లబుచ్చుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని మరొకవైపు ఉండడమే.
వీరిద్దరిలోనూ ఒకరిని ఎంచుకునేందుకు మరో రెండు మాసాల్లో ఎన్నికలు వచ్చేశాయి. మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య టాక్.. అభివృద్ధి వైపే ఉంది. 20 ఏళ్లు చూశాం బ్రో, నియోజ కవర్గాన్ని ఇంకా చాలా చాలా అభివృద్ధి చేయాల్సి ఉందని అంటున్నారు. మరి ఇన్నేళ్లు ఏం చేశారో! ఇక, చాలు, కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా! అని తటస్థ ఓటర్లు కూడా.. ఇదే మాట చెబుతున్నారు. అంతేకాదు.. మరికొందరు.. బూతులు మాట్లాడే నాయకుడు కాదు.. అభివృద్ధి చేసేవాడు కావాలని అంటున్నారు.
ఇప్పటి వరకు మాటల గారడీలకు పడిపోయిన గుడివాడ ఓటర్లు ఇంకా అస్సలు ఆ మాయ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఈ సారి గుడివాడ జనాల్లో మార్పు అంశమే ప్రధానంగా చర్చకు వస్తోంది. ఈ పరిణామాలతో గుడివాడ ముఖ చిత్రం ఈ ఎన్నికల్లో మారిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. అభివృద్ధి చేస్తానని.. చెబుతున్న వెనిగండ్ల వైపే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఆయన తన సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు దోచుకున్నారు.
మాటకు మాట కాకుండా.. చేతల్లో తాను చేయాల్సింది ఉందని చాలా ఉందని చెబుతున్నారు. మచ్చుకు విందామన్నా.. వెనిగండ్ల నోటి వెంట బూతు మాట వినిపించదు. ఆయన చేతులు కట్టుకుని కూర్చుంటారేమో అని చూద్దామన్నా.. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆగవు, ఇదీ ఇప్పుడు గుడివాడ టాక్. అందుకే ఈ సారి అభివృద్ధికే ఓటెత్తుతామని చెబుతున్నారు.