ప్రజల కోసం కాకపోవచ్చు. రాజకీయం కోసమే అయి ఉండొచ్చు. కానీ.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని.. వారి సమస్యల్ని వేలెత్తి చూపించేందుకు పాదయాత్ర అనే ప్రక్రియను ఎంచుకుంటే.. దానికి ఏపీ అధికారపక్షం ఇంతలా ఉలిక్కిపడాలా? పాదయాత్ర చేస్తున్న నాయకుడిపై అంతలా విరుచుకుపడాలా? ఎమ్మెల్యేగా గెలవలేకపోయినోడివి? అంటూ ఎక్కెసం చేసే వైసీపీ నేతలు.. మరి.. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తే.. ఎందుకంత కంగారు? మరెందుకు అంత ఉలికిపాటు? పట్టనట్లుగా ఉండిపోవచ్చు కదా?
తమకు తాము తోపులుగా భావించే వైసీపీ నేతలు.. తమ వరకు లోకేశ్ అన్న వ్యక్తి అసలు రాజకీయ నాయకుడే కాదని.. అతనికి మాట్లాడటమే రాదని ఫిక్సు అయినప్పుడు.. అలాంటి వారి గురించి మాట్లాడి టైం వేస్టు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా? కానీ.. అందుకు భిన్నంగా వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.
తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. లోకేశ్ పాదయాత్రపై ఆయన మండిపాటు చూసినప్పుడు విస్మయానికి గురి కాక మానదు. అంతేకాదు అప్పుడెప్పుడో మరణించిన ఎన్టీఆర్ మరణం మీద మాట్లాడిన కొడాలి నాని.. చంద్రబాబు మీద కేసు పెట్టాలంటున్నారు. ఆయన తాజాగా మాటల్ని వింటే..కొడాలి నానికి ఏమైందన్న సందేహం కలుగక మానదు. కావాలంటే.. ఆయన వ్యాఖ్యల్ని మీరే చదవండి.
– ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి వస్తుంటే గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయ్? యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయ్?
– సీఎం జగన్‌పై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేష్. అతడు నడిచేది రోజూ 10 కి.మీ కూడా లేదు. లోకేష్‌కు మాట్లాడటం రాదు. చంద్రబాబు తాను పాదయాత్ర చేయలేక కొడుకును రోడ్డు మీదకు వదిలాడు. జనం లేక లోకేష్ ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇస్తున్నాడు. చేతగాని మాటలతో లోకేష్ జనాలను చంపుతున్నాడు. మాట్లాడటం చేతగాని చవట దద్దమ్మ లోకేష్.
– నారావారిపల్లి నుంచి వలస వెళ్లింది నీవు నీబాబేగా లోకేష్? భీమవరం, గాజువాకకు పవన్‌ను వలస పంపింది బాబు కాదా? బాబు దత్తపుత్రుడు పవన్ ఏపీకి పొలిటికల్ టూరిస్ట్‌లు. పనికిమాలిన ముసలి సైకో చంద్రబాబు కడుపున.. పప్పుగుత్తిగాడు లోకేష్ పుట్టాడు. లోకేష్ నీ బాబాయ్‌ను ఏం చేశారు? ఎక్కడ దాచారు?మీడియా ముందుకు తెచ్చి చూపించండి.రామ్మూర్తి నాయుడుఎక్కడున్నాడు? పండగలకు కూడా కనిపించడం లేదు?
– నవీన్‌కు అవినాశ్ రెడ్డి ఫోన్ చేశారని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌తో మాట్లాడాలంటే అక్కడి సిబ్బందితో మాట్లాడాలి. వైఎస్ వివేకా హత్య సమయంలో సీఎం చంద్రబాబు. తరువాత 3 నెలలు సీఎం చంద్రబాబు. అప్పుడు చార్జిషీట్ ఎందుకు వేయలేదు?
చంద్రబాబు ఫోన్ కాల్స్‌పై సీబీఐ విచారణ జరపాలి. ఆ రోజు చంద్రబాబు, కడప జిల్లా టీడీపీ నేతలు.. పోలీసులతో ఏం మాట్లాడారు? రామారావును వెన్నుపోటుతో చంపారు. టీడీపీ ఆస్తులు చంద్రబాబు నొక్కేశారు. ఎన్టీఆర్ చావు మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలని హరికృష్ణ కోరారు. పసుపు రంగులో ఉండే రామారావు.. నల్లగా మారిపోయాడు. ముఖం కనిపించకుండా గుడ్డ కట్టారు. ఎన్టీఆర్ వారసులు పార్టీలోకి వస్తుంటే.. ఎందుకు వారికి గుండెపోట్లు వస్తున్నాయి?
– వైఎస్ వివేకాను ఓడించిన ఘనుడు చంద్రబాబు. వైఎస్ వివేకాను చంపించింది చంద్రబాబే. ఎన్టీఆర్‌ను ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు. ఎన్టీఆర్ చావు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎన్టీఆర్ మరణం మీద చంద్రబాబును విచారించాలి. పీఎం మోదీ, హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు లేఖలు రాస్తా.
– రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుకు దమ్ముంటే..సెక్యూరిటీ రాకుండా బయటకు రాగలడా? అధికారం తరువాత సంగతి. లోకేష్‌ను ముందు ఎమ్మెల్యే అవ్వమనండీ.
దీనికి కౌంటర్లు ఏంటో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.