మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని గురించి రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర లేదు. అవసరం ఉన్నా..లేకున్నా…చంద్రబాబు, లోకేష్, నారా కుటుంబంపై బూతులతో విరుచుకుపడడం ఆయనకు అలవాటు అని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. రాజకీయ విమర్శలను చంద్రబాబు, లోకేష్ వరకే పరిమితం చేయాల్సిన నాని..కొన్ని సార్లు హద్దులు మీరి నారా భువనేశ్వరిని కూడా విమర్శించారు. అయితే, కాలం అన్నిటికీ సమాధానమిస్తుంది అన్న రీతిలో…ఈ రోజు కొడాలి నాని తాను తిట్టిన భువనేశ్వరి పర్యవేక్షస్తున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరుగుతోంది.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో క్యాన్సర్ కు కొడాలి నాని నాని చికిత్స పొందుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో, గతంలో అసెంబ్లీలో నాని అవమానించిన నందమూరి ఆడపడుచు భువనేశ్వరి వాళ్ల ఆసుపత్రిలోనే చికిత్స పొందాల్సి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బసవతారకం ఆసుపత్రిలో నాని కారు ఎక్కుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.