మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఛాతి నొప్పితో బాధపడుతూ కుప్పకూలిన కొడాలి నానిని బుధువారం ఉదయాన్నే ప్రత్యేక అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు కొడాలికి చికిత్స అందిస్తున్నారు. ఛాతి నొప్పితో అడ్మిట్ అయిన నానికి అక్కడి సిబ్బంది పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఆయనకు గుండె సంబంధిన సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో నానికి గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొడాలి నాని హెల్త్ కండీషన్ నార్మల్ గానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. డాక్టర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నానికి ఏమీ కాకుడదని.. క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కోరుకుంటున్నారు.
ఇక కొందరు వైసీపీ నేతలు ఆసుపత్రికి చేరుకుని కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీస్తున్నారు. కాగా, వైసీపీలో ఉన్న ఫ్రైర్ బ్రాండ్ లీడర్స్ లో కొడాలి ఒకరు. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా శాసనసభకు ఎన్నికై.. వైసీపీ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ సమయంలో ప్రత్యర్థులపై కొడాలి ఏ రేంజ్ లో నోరు పారేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన కొడాలి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. గుడివాడ వైపు కన్నెత్తి చూడటం కూడా మానేశారు. హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొడాలి నాని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయనపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. కొడాలికి అత్యంత సన్నిహితుడు వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు ఉన్నారు. త్వరలో కొడాలి సైతం అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ బలంగా ప్రచారం జరుగుతోంది.