ఏపీ రాజకీయాలలో ఈక్వేషన్లు యమ స్పీడుగా మారిపోతున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌లు ఫీల్డ్‌లో దూసుకుపోతుండడం.. వైసీపీ నేతలు వెనుకబడిపోతుండడం… సర్వేలన్నీ జగన్‌ను నిద్రలేకుండా చేస్తుండడంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యేలను ఈసారి ఎన్నికల నుంచి పక్కనపెట్టాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఈ క్రమంలో జగన్ సైడ్ చేయబోయే తొలిపేరు బూతు రత్న కొడాలి నానిదేనని పార్టీలో బహిరంగంగానే వినిపిస్తోంది.
భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా పాలన చేయలేక కొంత, సొంత తప్పులతో మరికొంత తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్ ఇప్పుడు ఆ నష్ట నివారణ కోసం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే చాలామంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు భారీ మార్పులు ఉండబోతున్నాయి.
ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రలో ఈసారి వైసీపీ సీట్లు భారీగా తగ్గిపోతాయని సొంత సర్వేలతో పాటు బయటి సర్వేలు కూడా చెప్తుండడంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది.
గుడివాడలో కొడాలి నాని వంటివారికి టికెట్ ఇస్తే ఒక్క గుడివాడలోనే కాకుండా విజయవాడ వరకు ఆ నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గంతో పాటు ఎన్టీఆర్ అభిమానులలోనూ కొడాలి నాని వైఖరిపై తీవ్ర ఆగ్రహం ఉన్న విషయాన్ని వైసీపీ గుర్తించింది.
ఆ కారణంతోనే ఈసారి కొడాలి నానికి టికెట్ ఇవ్వబోవడం లేదట.
ఆయన్ను ఎన్నికల ప్రచారంలో కూడా పెద్దగా ఉపయోగించుకోకూడదని.. ఆయన వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేస్తున్నాయని.. ఇప్పటికే పార్టీ గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో నాని వైఖరి, రెక్లస్ గా ఉండే ఆయన తీరు చాలా కొద్దిమంది ఆయన అనుచరులకే తప్ప సామాన్య ప్రజలకు నచ్చడం లేదని పార్టీ గుర్తించింది.
అందుకే వచ్చే ఎన్నికలలో గుడివాడలో కొడాలి నానిని ఇంటికే పరిమితం చేసి కొత్త అభ్యర్థిని తీసుకురావడానికి అన్నీ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల టాక్.