నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి… ఉమ్మడి రాష్ట్రంలో చిట్టచివరి ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే ఏపీ రెండుగా చీలిపోయి.. తెలంగాణ ఏర్పడింది. అయితే.. ముఖ్యమంత్రిగా ఆయన మాత్రం విభజనను వ్యతిరేకించారు. సరే.. కాంగ్రెస్‌కు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో స్పీకర్‌గా కూడా పనిచేశారు. అయితే.. వైఎస్ మరణంతో అనూహ్యంగా కిరణ్ సీఎం అయ్యారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్‌కుమార్ రెడ్డి 2012-13లో నిత్యం మీడియాలో కనిపించారు. అయితే.. రాష్ట్ర విభజన జరిగిపోయింది. దీంతో అప్పటి వరకు వీరవిధేయతగా ఉన్న కాంగ్రెస్‌ను త్యజించి.. సొంత పార్టీ పెట్టుకున్నారు. సమైక్య ఏపీ అనే పార్టీ పెట్టుకుని 2014లో పోటీ కికూడా దిగారు. కానీ, ఎవరూ గెలవలేదు. దీంతో అప్పటి నుంచి కొన్నాళ్ల వరకు సైలెంట్ అయ్యారు.
అయితే, మళ్లీ ఏమనుకున్నారో.. ఏమో.. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కిరణ్..అక్కడి రాజకీయాలకే పరిమితం అవుతారో.. లేక ఏపీకి వస్తారో తెలియదు కానీ.. ఇప్పుడు మరోసారి ఆయన కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి.. బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని సమాచారం. పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్తామన్న బీజేపీ హామీ మేరకు ఆయన చేరికకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇదీ.. ప్రొఫైల్
కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. తండ్రి అమర్నాథ్ రెడ్డి మరణంతో తొలిసారిగా 1989 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాయల్పాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
+ 1999, 2004లోనూ ఇదే స్థానం నుంచి నెగ్గారు.
+ దివంగత వైఎస్‌కు సన్నిహితుడిగా పేరున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. 2009లో పీలేరు నుంచి గెలిచారు.
+ ప్రభుత్వ చీఫ్ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు.
+ కీలకమైన ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ కిరణ్ హయాంలోనే వచ్చింది.