ఏపీలో ఆడపిల్లలపై నిత్యం అత్యాచారాలు, ఘోరాలు జరుగుతున్నాయి.
ఏపీ ఒకప్పటి బీహార్ లా దుర్ఘటనలు జరుగుతున్నాయి.
గతంలో ఎన్నడూ ఏపీ ఇలాంటి పరిస్థితులను చూడలేదు.
జగన్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి.
పోలీసులు రాజకీయ అరెస్టులు చేయడంలో బిజీగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని పట్టించుకోవడం లేదని నేరస్థులు రెచ్చిపోతున్నారా?
లేకపోతే నేరస్థులపై పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్ల ఇలా జరుగుతోందా?
ఏది ఏమైనా చిన్నారులపై, మైనర్లపై ఇలాంటి ఘోరాలు జరగడం మహా దారుణం.
నేరాలను కంట్రోల్ చేయలేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం, పోలీసులు ఇరువురు ఎదుర్కోవల్సి వస్తుంది.
.@ysjagan గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆడబిడ్డల్ని బయటకి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది.(1/3) pic.twitter.com/HyTb7mivAD
— Lokesh Nara (@naralokesh) September 14, 2021
కనీసం ఒక్క ఘటనలో కూడా నిందితులకు శిక్ష పడకపోవడం వల్లే కామోన్మాదులు రెచ్చిపోతున్నారు. మీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కోసం పోలీసుల్ని వాడుకోవడం మానేస్తే, కనీసం వారు నిందితులనైనా పట్టుకుంటారు.(3/3)
— Lokesh Nara (@naralokesh) September 14, 2021