కీరన్ పొలార్డ్…క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర లేని పేరు. తన కెరీర్ తొలినాళ్లలో పొలార్డ్ అరవీర భయంకరంగా హిట్టింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించేవి. ఆ తర్వాత కాలక్రమంలో పొలార్డ్ ఫామ్ కోల్పోయాడు. ఏదో అడపా దడపా మెరుపులు మెరిపించడం తప్ప మునుపటి పొలార్డ్ కనుమరుగయ్యాడు. ఇటువంటి సమయంలో పొలార్డ్ మ్యాజిక్ చేశాడు. తన ఫామ్ ను అందుకోవడంతో పాటు ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు.
పొలార్డ్ బాదుడుకు స్టేడియం దద్దరిల్లిపోయింది. పొలార్డ్ ధాటికి విండీస్ 131 పరుగుల లక్ష్యాన్ని13.1ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్ గా పొలార్డ్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మెన్ హర్షలీ గిబ్స్, భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ల తర్వాత ఈ ఘనత దక్కించుకున్న క్రికెటర్ పొలార్డ్ కావడం విశేషం.