కియా మోటార్స్…
విడిపోతుందో లేదో తెలియని ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి ఆత్మ కొరియాతో సంప్రదింపులు జరిపి నెలకొల్పిన ఈ పరిశ్రమ తెలిసిందే కదా.
అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో బెంగుళూరు హైవే పక్కనే ఉంటుంది.
ప్రస్తుతం ఈ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కియా సోనెట్, కార్నివాల్ బాగా మనసు దోచాయి.
దేశంలో అడుగుపెట్టిన రెండేళ్లలోపే అగ్రగామి కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది కియా మోటార్స్ .
అయితే ఈ కంపెనీ తాజాగా పేరు మార్చుకుంది. లోగో కూడా మారింది.
కంపెనీ పేరును ఇకపై ‘కియా ఇండియా’గా మారుస్తున్నట్టు తెలిపింది. కియా మోటార్స్ స్థానంలో ఇకపై కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా అవతరించింది.
కంపెనీ బ్రాండ్‌కు కొత్త పేరు మరింత గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది యాజమాన్యం.
అనంతపురంలోని కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో పేరు, లోగోలో మార్పులు చేసింది. దశలవారీగా డీలర్షిప్ కేంద్రాల వద్ద కూడా మార్పులు చేయనున్నట్టు కియా తెలిపింది.
Whenever you move, you find new ways. New ways to make your mark. Some of them are big and some of them small. But that’s the thing with ideas. You need to move to discover them.#MovementThatInspires #NewKia #KiaIndia
— Kia India (@KiaInd) May 20, 2021