దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలితో తెలుగు సినిమా రూపురేఖలు మారిపోతే.. కేజీఎఫ్ తో కన్నడ సినీ ప్రపంచం ఎంతలా ప్రభావానికి లోనైందన్న విషయంలో తెలిసిందే. ఈ సినిమా ముందు వరకు కన్నడ సినిమాల్ని పట్టించుకునే వారే ఉండేవారు కాదు. అందుకు భిన్నంగా ఇప్పుడు శాండల్ వుడ్ నుంచి ఏదైనా ప్రత్యేక సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక.. కేజీఎఫ్ లో పవర్ ఫుల్ జర్నలిస్టు పాత్రను పోషించి.. తన తీరుతో అందరికి భయాన్ని కలిగించే లేడీ జర్నలిస్టు పాత్ర సినిమాలో ప్రత్యేకంగా ఉంటుంది. రెండు భాగాల్లోనూ ఈ పాత్ర కనిపించేది తక్కువే అయినా.. సినిమా మొత్తాన్ని ఈ పాత్ర ప్రభావితం చేయటం తెలిసిందే.
ఈ పాత్రను పర్ ఫెక్టుగా పోషించారు మాళవిక అవినాష్. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో.. ఆమెకు ఏమైందన్న ఆరా మొదలైంది. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఇంతకూ ఆమె ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య ఏమన్న దానికి చూస్తే.. మైగ్రేన్ గా తేలింది. గడిచిన కొన్నేళ్లుగా తాను మైగ్రేన్ తో బాధ పడుతున్నానని.. ఏముందిలే చిన్న సమస్య అని తాను తేలికగా తీసుకున్నానని.. కానీ.. అలా చేస్తే..తన మాదిరి ఆసుపత్రి పాలు అవుతారని పేర్కొన్నారు.
‘మైగ్రేన్ సమస్య ఉన్నవారు కచ్ఛితంగా డాక్టర్ ను సంప్రదించాలి’ అని పోస్టు పెట్టారు. ఈ పోస్టులో తాను ఆసుపత్రి బెడ్ లో ఉన్న పిక్ ను షేర్ చేశారు. ఇందులో ఆమె బాగా మారినట్లుగా ఆమె ముఖం కనిపించటం గమనార్హం. ఆమె పోస్టు చేసిన పిక్.. ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని.. కేజీఎఫ్ చాప్టర్ర 3ను తమకు త్వరగా చెప్పాలంటూ పోస్టులు పెడుతూ.. ఆమెను ఉత్సాహపరుస్తున్నారు నెటిజన్లు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.