ఈ సాయంత్రం రామ్‌చరణ్ ఆవిష్కరించిన ఈ సినిమా ట్రైలర్‌ను కెజిజి సిరీస్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కోసం యావత్ భారతీయ సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రకాష్‌రాజ్ పాత్ర గరుడ మరణం తర్వాత ఏమి జరిగిందో రాకీ కథను వివరించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. బహుశా సినిమాకు కూడా అదే ఫస్ట్ సీన్ కావచ్చేమో.
రాకీ (యష్) యొక్క పవర్-ప్యాక్డ్ ఎంట్రీ, ప్రభుత్వం ఒకవైపు, ప్రత్యర్థులు మరోవైపు ఉండటంతో రాకీ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎలివేట్ చేసిందీ ట్రైలర్.
ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2018లో విడుదలైన బ్లాక్ బస్టర్ KGF కి సీక్వెల్. ప్రశాంత్ నీల్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ చిత్రంలో సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్, అచ్యుత్ కుమార్, అయ్యప్ప పి శర్మ, రావు రమేష్, ఈశ్వరీ రావు మరియు అర్చన జోయిస్ వంటి భారీ తారాగణం ఉంది. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.