అనుష్క శెట్టి తెలుగు సినిమా అగ్ర నటీమణులలో ఒకరు.
దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి.
ఎందుకు అశ్రద్ధ చేసిందో మరి… ఆమె బాగా బరువు పెరిగింది.
దీంతో ఇపుడు తన బరువును తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
బాహుబలి వంటి భారీ హిట్ తర్వాత కూడా ఆమె ఏ పెద్ద సినిమా చేయకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది.
అభిమానులను నిరాశ పరుస్తోంది. తెలుగులో భారీ అభిమానులను కలిగి ఉన్న నటి అనుష్క.
ఆమె పునరాగమనం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆమె ఇటీవలి నెలల్లో పబ్లిక్‌గా కనిపించడం లేదు.
కానీ ఆమె రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి ఊహాగానాలు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో RRR ప్రత్యేక ప్రదర్శనలో ఆమె తళుక్కుమంది. ఈ సందర్భంగా ఆమె లావుగా కనిపించింది ఇంకా బరువు తగ్గలేదు.
UV క్రియేషన్స్ కొంతకాలం క్రితం అనుష్క మరియు నవీన్ పోలిశెట్టిలతో ఒక చిత్రాన్ని ప్రకటించింది, కానీ ప్రస్తుతానికి ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్లు లేవు.
ఆసక్తికరమైన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహించనున్నారు. అనుష్క కూడా రెండు వెబ్ ఆధారిత ప్రాజెక్ట్‌లకు సంతకం చేసిందని మరియు అవి ఇంకా ప్రకటించబడలేదని ఊహాగానాలు ఉన్నాయి.
#AnushkaShetty spotted with #RamCharan and UV Creations producer Vicky at #RRR Success meet celebrations today🥺🥰❤️ pic.twitter.com/rMYpbnAcWM
— Team Pranushka™ (@TPranushka) March 26, 2022