ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు తొలిసారిగా ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం సాగింది. ఈ క్రమంలోనే కేబినెట్ అజెండాలోని అన్ని అంశాలకు సభ్యులందరితో ఆమోదం లభించింది. సీఎం హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు…
మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఆమోదం
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గ ఆమోదం
ఏప్రిల్ నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ పెంపునకు కేబినెట్ ఆమోదం
పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గ ఆమోదం
గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ..సభ్యుడిగా నారా లోకేశ్
7 అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు మంత్రివర్గ నిర్ణయం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్, పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం అంశాలపై శ్వేతపత్రాల విడుదల
వైఎస్సార్ వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ
పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు