అలాగే ఉంది క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా వైద్యంకోసం ఏపి నుండి హైదరాబాద్ కు వచ్చే రోగులను సరిహద్దుల్లోనే ఆపేయటం అప్రజాస్వామ్యమే కాదు అమానవీయమనే చప్పాలి. రాష్ట్ర విభజన జరగకముందు, జరిగిన కొత్తల్లో కేసీయార్ మాట్లాడుతు రాష్ట్రాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసుందాం అనే కథలు చాలానే చెప్పారు. ఆ తర్వాత కూడా అవసరమైనపుడు తియ్యగా మాట్లాడటం, అవసరం తీరిపోగానే నోటికొచ్చినట్లు మాట్లాడటం కేసీయార్ అండ్ కో కు అలవాటుగా మారిపోయింది.
ప్రస్తుత విషయానికి వస్తే వైద్యంకోసం వచ్చిన వందలాది అంబులెన్సులను సరిహద్దుల్లోనే నిలిపేశారు. అంబులెన్సులను నిలిపేయటం తప్పని స్వయంగా హైకోర్టు ఎంత చెప్పినా కేసీయార్ వినిపించుకోలేదు. అంటే ప్రాణాలు పోతున్న సరే ఏపి రోగులను మాత్రం తెలంగాణాలోకి రానిచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో తెలంగాణాలో ప్రత్యేకంగా గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏపీ జనాల్లో కేసీయార్ పై మంట బాగా పెరిగిపోతోంది.
ఎన్నికలపుడు ఏపి ప్రజల ఓట్లకోసం తియ్యగా మాట్లాడిన కేసీయార్ ఆపత్కాలంలో అంబులెన్సులను అడ్డుకోవటంపై తీవ్రంగా మండిపోతున్నారు. జరుగుతున్నదాన్ని బట్టి కేసీయార్ కు ఏపి జనాల ఓట్లు మాత్రమే కావాలా ? అనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఏపి జనాలను కేసీయార్ కేవలం ఓట్లుగా మాత్రమే చూస్తున్నారనే విషయం ఇపుడు స్పష్టమైపోయిందనే ఆగ్రహం కూడా జనాల్లో బాగా పెరిగిపోతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరేమని అనుకున్నా, ఎంత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా కేసీయార్ మాత్రం తాను ఏమనుకుంటే అదే చేస్తున్నారు. మానవతా ధృక్పదంతో రోగులను కూడా హైదరాబాద్ కు రానీయటంలేదు. అసలు విభజన చట్టప్రకారమే తెలంగాణా-ఏపికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. కేసీయార్ ఆ విషయాన్ని కూడా లెక్క చేయటంలేదు. దీనికి కేంద్రం+ఏపి పాలకులు, రాజకీయపార్టీలు సిగ్గుతో తలొంచుకోవాల్సిందే.