తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరు కావడం చర్చనీయంగా మారింది.
చాలాకాలంగా ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న ప్రకాశ్ రాజ్ ఇప్పుడు కేసీఆర్ వెంట కనిపించడంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం కావడానికి చేస్తున్న ప్రయత్నాలలో ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినిపిస్తోంది.
నిజానికి సీఎం కేసీఆర్, నటుడు ప్రకాశ్ రాజ్ ల మధ్య మంచి సానిహిత్యం ఉంది.
గతంలోనూ బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్నామ్యాయంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన సందర్భంలోనూ ప్రకాశ్ రాజ్ ఉన్నారు.
జేడీఎస్ నేతలు మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలను కలిసి కేసీఆర్ కూటమి ఏర్పాటు అంశం గురించి చర్చించారు. ఆ సందర్భంలోనూ కేసీఆర్ వెంట నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు.
ప్రకాష్ సామాజిక అంశాలపై గట్టిగా స్పందిస్తుంటారు. తను బీజేపీ వ్యతిరేకిని అని కూడా గట్టిగా చెప్పుకుంటారు. ఈ నేఫథ్యంలో కన్నడ రాజకీయ నేతలతో కేసీఆర్ సమావేశంలో ప్రకాష్ రాజ్ కనిపించాడు.
కేవలం కన్నడ రాజకీయ నేతలతోనే కాకుండా తమిళ రాజకీయ నేతలతో కేసీఆర్ చర్చలకు ఇప్పుడు మధ్యవర్తి అవుతున్నాడట.
ప్రకాష్ రాజ్ కన్నడ, తెలుగు, తమిళంలో నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో మరోసారి కేసీఆర్ కి మద్దతుగా ప్రకాశ్ రాజ్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి పొరుగు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ మీటింగు అంటే ప్రకాశ్ రాజ్ మధ్యవర్తిగా ఉండాల్సిందేనని టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.