96 వేల ట్రాక్టర్లు
20 లక్షల మంది రైతుల ప్రత్యక్ష పోరాటం
20 కోట్ల రైతు కుటుంబాల వేదన
ఇవేమీ పార్టీపేరులోనే ‘రైతు’ అని పెట్టుకున్న ‘‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ‘ అధినేత జగన్ రెడ్డికి పట్టడం లేదు.
మోడీకి కోపం రాకుండా ఉండాలంటే రైతుల పోరాటానికి గాని, భారత్ బంద్ కి గాని మద్దతు పలకకూడదు…. ఇదే జగన్ పరిస్థితి అని జనం జగన్ ను విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరు #IstandwithFarmers అంటున్నారు… ఒక్క జగన్ రెడ్డి తప్ప!
దేశంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతు తెలపని ఏకైకా సీఎంలా మిగిలిపోయాడు. బీజేపీ సీఎంలు కూడా వేరే రైతులను మా రాష్ట్రంలోకి రానివ్వం అంటూ పరోక్షంగా రైతుల పోరాటానికి మద్దతు పలుకుతున్నారు గాని జగన్ మాత్రం ఉలుకుపలుకు లేకుండా సైలెంటుగా ఉన్నారు.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు బహిరంగ మద్దతు ఇచ్చారు, వారికి సంఘీభావంగా భావంగా 8వ తేదీ భారత్ బంద్ పాటిస్తున్నారు.
అయినా జగన్ రెడ్డి కేసుల భయం తప్ప రైతుల బాధలు గుర్తుకు రావడం లేదు. ఏం చేద్దాం ఆయన పరిస్థితి అలాంటిది అంటూ ఆయన అభిమానులే నిట్టూర్చడటం కొసమెరుపు.
తెలంగాణలో ప్రభుత్వం రైతులకు మద్దతుగా బంద్ పాటిస్తుంటే… ఏపీలో తాజాగా వ్యవసాయ మంత్రి కన్నబాబు ఒంటి గంట లోపు, అల్లరి చేయకుండా బంద్ చేసుకోండి. హింసాత్మకం చేశారో మీ సంగతి చూస్తాం అని అర్థమొచ్చేలా రైతులకు వార్నింగ్ లాంటి మద్దతు ఇచ్చారు. అది మద్దతో వార్నింగో అర్థం కాని రైతు తలగోక్కునే పరిస్థితి.