తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదికతో మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున పడేసిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్ల పేరుతో గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని, ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటిపోయిందని కాగ్ చెప్పిన విషయాన్ని రేవంత్ బట్టబయలు చేశారు.
ఇక, గొర్రెల పంపకం పథకంలో భారీ అవినీతి జరిగిందని కాగ్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు విచారణ చేపడతారని, కేసీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని పుకార్లు వస్తున్నాయి. దీంతో, ఆ పుకార్లపై కేటీఆర్, హరీష్ రావు భయపడుతున్నారని ప్రచారం జరుగుతోంది.