కేసీఆర్ సుద్దపూస మాటలు చూడండి#Telangana pic.twitter.com/kNTODsT9zw
— Aapanna Hastham (@AapannaHastham) March 13, 2024
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ లో ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ లో ఎలాంటి మార్పు రాలేదని అర్ధమవుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార సభ కదనభేరిలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రేవంత్ రెడ్డిపైన ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. రేవంత్ వ్యవహారశైలిపైన, మాటలపైన మండిపోయారు. ఇవన్నీ మామూలే అని సరి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే అధికారంలో ఉన్న పదేళ్ళల్లో ప్రత్యర్ధులపై కేసీయార్ కూడా ఇంతకన్నా ఎక్కువగానే నోరుపారేసుకున్నారు. పోయిన ఎన్నికల్లో తనను మూడోసారి గెలిపించుంటే దేశంలోనే చిచ్చుపెడుతుండే వాడినని అనటమే ఆశ్చర్యంగా ఉంది.
దేశంలో అగ్గిరాజేసుండేవాడినని, సగందేశంలో చిచ్చుపెట్టేవాడినని, దేశంమొత్తాన్ని చైతన్యం చేసేవాడినని చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. దేశంలో అగ్గిపెట్టడం ఏమిటి ? సగందేశంలో చిచ్చుపెట్టడం ఏమిటో ? దేశమంతా చైతన్యం తేవటం ఏమిటో జనాలకు అర్ధంకాలేదు. అగ్గిపెట్టడం, చిచ్చుపెట్టడంపై కేసీయార్ వివరణ ఇవ్వలేదు. ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికోసం దేశంలో అగ్గిపెడుతారు, చిచ్చు పెట్టుండేవారో కేసీయార్ వివరిస్తే బాగుండేది. దేశంలో ఎవరిలో చైతన్యం తెస్తారు ? ఎవరికి వ్యతిరేకంగా చైతన్యం తెస్తారో చెప్పలేదు. జనాలు ఆశకో లేకపోతే అత్యాశకో పోయి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారని చెప్పటమే విచిత్రంగా ఉంది.
జనాలు బీఆర్ఎస్ ను గెలిపించుంటే తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ ను గెలిపించారు కాబట్టి అత్యాశకు పోయినట్లు కేసీయార్ చెప్పటం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత దయాకర్ మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తామిచ్చిన హామీలకు మించే కేసీయార్ హామీలను గుప్పించిన విషయాన్ని దయాకర్ గుర్తుచేశారు. ఓట్లేసి గెలిపిస్తే మంచోళ్ళు ఓడిస్తే అత్యాసకుపోయారని కేసీయార్ చెప్పటం జనాలను అవమానించటమే అని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు క్రెడిబులిటి పోయింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్దగా పట్టించుకోలేదన్నది వాస్తవం. ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, స్టాలిన్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని రెండుమూడుసార్లు కలిసినా ఎవరూ కేసీయార్ తో కలవటానికి సానుకూలత చూపించలేదు. అటు ఎన్డీయే ఇటు యూపీఏ లేకపోతే ఇండియా కూటమితో సంబంధంలేకుండా కేసీయార్ పుట్టించే అగ్గిలేదు, మండించే మంటలు లేవు. ఒంటరిగా మిగిలిపోయారు కాబట్టే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. అలాంటిది అగ్గని, మంటలని, చిచ్చని మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.