ఒకే నెలలో రెండు సార్లు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఢిల్లీ వెళ్లారు. వెల్లిన రెండు సార్లు ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగారు. పైగా ఎక్కువ సమయం ఢిల్లీలో గడిపారు. మరి ఆయన అసలు ఢిల్లీ కి ఎందుకు వెళ్లారు? దీనికి అసలు కారణం ఏంటి? అది సక్సెస్సా ఫెయిలా? అన్న చర్చ నడుస్తోంది.
తాజాగా వినపడుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు అసలు కారణం హుజూరాబాదే అని తేలింది. కేసీఆర్ సెప్టెంబర్లో రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. అతను సెప్టెంబర్ 2 న ఢిల్లీకి వెళ్లి, తొమ్మిది రోజులు ఉండి, సెప్టెంబర్ 10 న తిరిగి వచ్చాడు. సెప్టెంబర్ 24 న మళ్లీ ఢిల్లీ వెళ్లాడు. సెప్టెంబర్ 26 న తిరిగి రావాల్సి ఉంది. కానీ తన ఢిల్లీ పర్యటనను మరో రెండు రోజులు పొడిగించి, సెప్టెంబర్ 28 న తిరిగి వచ్చారు.
ఆయన మొదటిసారి ఢిల్లీలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం మంగళవారం హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది.
గతసారి, సెప్టెంబర్ మొదటి వారంలో కెసిఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలో ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అపుడు హజురాబాద్ నోటిఫికేషన్ రాకుండా ఆపడానికే వెళ్లారట. తాజాగా మళ్లీ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి దానిని ఆపడానికి రెండోసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారట. అయితే, బీజేపీ కండిషన్స్ నచ్చక … చేసేదేమీ లేక కేసీఆర్ నిరాశతో వెనుదిరిగారు. ఆయన తిరిగి వస్తున్న రోజునే ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇది కేసీఆర్ ను తీవ్ర నిరాశకు గురిచేసిందట. తన తాజా ఢిల్లీ పర్యటనలో, కెసిఆర్ మూడు రోజుల్లో అమిత్ షాను మూడుసార్లు కలిశారు, ఇది హుజూరాబాద్ ఉప ఎన్నికను మరింత ఆలస్యం చేయడానికి చేసిన లాబీనే. కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో కేసీఆర్ తీవ్ర నిరాశ చెందారని అంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్ కేసీఆర్ కు ఎపుడూ లేనంత తీవ్ర వేదన కలిగిస్తోంది.