రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. తమకు అనుకూలంగా ఏదైనా చేయాలని అనుకునే నాయకులు ఏదైనా చేస్తారు. తిమ్మిని బమ్మి చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు అందరికీ తెలిసిందే. తన ప్రయోజనం కోసం.. ఎదుటివారిని డిఫెన్స్‌లో పడేయగల నేర్పున్న నాయకుడు. ఇలా చేసే.. గత రెండు సార్లు విజయం దక్కించుకున్నారనే వాదన ఉంది.
రాష్ట్ర ప్రకటిస్తే… కాంగ్రెస్‌లో తన ఉద్యమ పార్టీ టీఆర్ ఎస్‌ని విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్, ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం ఇచ్చిన కేసీఆర్.. తర్వాత ఏం చేశారో.. తెలిసిందే. సో.. ఆయన చేతికి, నోటికి.. వ్యూహాలకు కూడా ఎముకల్లేనట్టే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహమేదైనా.. రాజకీయ వ్యూహం పన్నారా? అనేది చర్చకు దారితీస్తోంది.
ఎందుకంటే.. చంద్రబాబుకు, కేసీఆర్‌కు పడదనే విషయం తెలిసిందే. అలాగని ఇద్దరూ కూడా బద్ధ శత్రు వులు ఏమీ కారు. సో.. ఇప్పుడు తమ తమ అవసరాల కోసం.. పరస్పరం సహకరించుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు తెలంగాణలో అధికారంలోకి రావాలని లేదు. అదేసమయం లో కేసీఆర్ ఓడిపోవాలని కూడా కోరుకోవడం లేదు. అదే ఉంటే.. ఏపీలో పిలుపు ఇచ్చినట్టు.. తెలంగాణలో కూడా.. కేసీఆర్‌ను ఓడించాలని అనేవారు.
కానీ, ఒక్క మాట కూడా అనలేదు. ఇక, తన వారిని వెనక్కి వచ్చేయాలని.. తొలిసారి చంద్రబాబు పిలుపునిచ్చారు. గతంలోనూ చంద్రబాబు ఇక్కడ పర్యటించిన.. ఎప్పుడూ కూడా ఇలా పిలుపునివ్వలేదు. సో.. దీనివెనుక.. కేసీఆర్ వ్యతిరేకతను తగ్గించే వ్యూహం ఏదో ఉందని.. అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు మాట విని వెనక్కి వచ్చేవారు 10 మంది ఉన్నా.. ఆమేరకు.. వ్యతిరేక ఓటు చీలి.. కేసీఆర్‌కు మేలు చేస్తుంది. అదేసమయంలో వైఎస్ షర్మిల రాజకీయాలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. మొత్తానికి ఏదో వ్యూహం అయితే.. ఉందని అంటున్నారు పరిశీలకులు.