దేశంలోని అందరి ముఖ్యమంత్రుల్లోను ఎక్కువ జనాగ్రహం ఎవరిపైన ఉంది ? అన్నదానికి ఏఐఎన్ఎస్-సీ ఓటర్ సర్వే సమాధానమిచ్చింది. ఈ రెండు సంస్ధలు యాంగర్ ఇండెక్క్ పేరుతో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులపై సర్వేచేశాయి. అందులో దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా జనాలు ఆగ్రహంగా ఉన్నది తెలంగాణా సీఎం కేసీయార్ పైనే అని తేలింది. తెలంగాణాతో పాటు ఏపీ, రాజస్ధాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలపైన జనాభిప్రాయంపై సర్వే చేసింది.
ఇందులో తెలంగాణా సీఎం కేసీయార్ పై 50 శాతం జనాల్లో అత్యధికంగా వ్యతిరేకత ఉందని తేలింది. రాజస్ధాన్, ఏపీ, మధ్యప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, జగన్మోహన్ రెడ్డి, శివరాజ్ సింగ్ చౌహాన్ పైన కూడా జనాలు వ్యతిరేకంగా ఉన్నారట. 50 శాతం జనాలు కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తేలిందంటే వాళ్ళంతా మార్పును కోరుకుంటున్నారని అర్ధమవుతోంది. అశోక్ గెహ్లాట్ పైన 49.2 శాతం, జగన్ పై 35.1 శాతం జనాలు ఆగ్రహంగా ఉన్నారట.
మిజోరం సీఎం జోరంతంగా పైన 37.1, శివరాజ్ సింగ్ చౌహాన్ పై 27 శాతం మంది జనాలు మండిపోతున్నారట. ఇక బెస్ట్ ముఖ్యమంత్రిగా నిలిచింది ఎవరో తెలుసా ? చత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ భగేల్ పైన 25.4 శాతం జనాలు మాత్రమే ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ మీద జనాల్లో ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారు ? దేశం మొత్తంమీద అన్నీ రాష్ట్రాల్లోకి తెలంగాణానే బెస్ట్ అని కేసీయార్ పదేపదే చెప్పుకుంటున్నారు. తెలంగాణాలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశంలో మరే రాష్ట్రంలోను జరగడం లేదని చెప్పుకుంటున్నారు.
రాష్ట్రం కోసం ఇంతగా పనిచేస్తున్న కేసీఆర్ పై ఎందుకింత వ్యతిరేకత ఉంది ? ఎందుకంటే తాను చెప్పుకుంటున్నదంతా అబద్ధాలే అని అనుకోవాలి. గడచిన తొమ్మిదేళ్ళుగా అసెంబ్లీ నియోజకవర్గాలను కేసీయార్ ఎంఎల్ఏలకు రాసిచ్చేశారు. నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు ఆడిండే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. దాంతో అవినీతి, అరాచకాలు ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. జనాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్లు ప్రకటించటంతోనే జనాల ఆగ్రహమంతా కేసీయార్ పైకి మళ్ళిందని సమాచారం.