కీలక వ్యాఖ్యలు చేసింది కర్ణాటక హైకోర్టు. పెళ్లై.. శారీరక సంబంధానికి నో చెప్పే భర్త తీరుపై భార్య.. ఆమె కుటుంబ సభ్యులు మోపిన క్రిమినల్ నేరారోపణల్ని కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన తర్వాత శారీరక సంబంధాన్ని కాదని చెప్పటం తప్పే అయినప్పటికీ నేరం కాదన్న విషయంపై సున్నిత అంశాల్ని ప్రస్తావించింది కర్నాటక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.
పెళ్లి చేసుకున్న తర్వాత శారీరక సంబంధాన్ని కాదని చెప్పటం నేరంగా హిందూ వివాహ చట్టం 1955 స్పష్టం చేస్తుందని పేర్కొన్న కోర్టు.. ‘లైంగిక చర్య వద్దని చెప్పటం.. నిరాకరించటం క్రూరత్వంతో సమానం. అయితే.. అదేమీ క్రిమినల్ నేరం కాదు’ అని స్పష్టం చేసింది. తనతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించిన ఉదంతంలో భార్య.. ఆమె తల్లిదండ్రులు క్రిమినల్ కేసును దాఖలు చేశారు.
శారీరక సంబంధానికి నో చెప్పటం ఐపీసీ సెక్షన్ 498ఏ కిందకు రాదని.. ఆ నేరారోపణను దాని కింద చూడలేమని పేర్కొంది.ఐపీసీ సెక్షన్ 498ఏ.. వరకట్న నిరోధక చట్టం 1961 సెక్షన్ 4 కింద దాఖలైన కేసులు.. పోలీసు చార్జిషీట్ కు వ్యతిరేకంగా భర్త హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టున్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న కీలక అంశాల్ని ప్రస్తావించారు.
పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ఉద్దేశంలో ప్రేమ అంటే శారీరక సంబంధం కాదని.. అది ఆత్మల కలయికగా భావిస్తారన్న కోర్టు.. అందుకే భార్యతో శారీరక సంబంధాన్నినిరాకరించినట్లు పేర్కొన్నారు. ఇలా శారీరక సంబంధాన్ని కలిగి ఉండకపోవటం క్రూరమైన చర్యే కానీ.. ఐపీసీ 498(ఏ) కింద నేరం కాదని చెబుతూ కేసును కొట్టేశారు. భర్త.. అతని తల్లిదండ్రులపై చర్యలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.