మొత్తానికి రఘు రామ కృష్ణంరాజు కు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు సరిదిద్దడానికి పూనుకున్నారు. బీజేపీకి భారీ ఎలివేషన్లు ఇచ్చి ఎంత సపోర్ట్ చేసినా… జగన్ ఏం మాయ చేశాడో గాని అతనికి నరసాపురం సీటు బీజేపీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇది కూటమికి మంచిది కాదని చంద్రబాబు ఆయన కోసం ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఎంపీగా ఇప్పించడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు. మరి అది విజయవంతం అయ్యిందో… లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో అన్న విషయం నేడు తేలిపోనుంది. రఘురామరాజును టీడీపీలోకి తీసుకోనున్నారు.
ఎంపీగా వస్తుందో రాదో తెలియదు గాని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం పశ్చిమగోదావరిలోని ’ఉండి’ నియోజకవర్గం సీటును రఘురామరాజుకు ఇచ్చే అవకాశం ఉంది.
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు..
ఈరోజు సాయంత్రం పాలకొల్లులో జరుగనున్న "ప్రజాగళం" సభలో శ్రీ @ncbn గారి సమక్షంలో @JaiTDP లో చేరుతున్నానని తెలియజేస్తున్నాను.
ప్రజలందరూ @BJP4India – @JaiTDP – @JanaSenaParty కూటమికి మద్దతు తెలిపి, ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/EgRLPoA1An
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) April 5, 2024