ఖండాంతరానికి చేరిన తెలుగువాడు అమరావతికి అండాదండా నేనంటూ నిలిచాడు.. జన్మభూమి రుణం తీర్చగ పిడికిలి ఎత్తి.. కదంతొక్కి నినదించాడు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అణిచివేయాలని చూస్తున్న నేపథ్యంలో పలువురు ప్రవాసాంధ్రులు రైతులకు అండగా నిలుస్తున్నారు. ‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని’ నినాదంతో ఉద్యమిస్తున్న రైతులకు తమ వంతు ఆర్థిక సాయం అందజేసేందుకు #NRIsFORAMARAVATI అనే సంస్థను ఏర్పాటు చేశారు. జయరాం కోమటి’ పిలుపునకు స్పంధించి ఈ సంస్థకు అమెరికా లోని కాన్సాస్ సిటీ ప్రవాసాంధ్రులు రూ. 9 లక్షలు విరాళమిచ్చారు. కాన్సాస్ సిటీ ప్రవాసులు రావు ద్రోణవల్లి, అరుణ్ కొమ్మినేని ఆధ్వర్యంలో కాన్సాస్ సిటీకి చెందిన పలువురు ప్రవాసాంధ్రులు రూ. 9 లక్షలు సేకరించి #NRIsFORAMARAVATI సంస్థకు అందచేశారు. తమకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులకు అమరావతి రాజధాని రైతులు ధన్యవాదాలు తెలిపారు