రొటీన్ సినిమాలకు భిన్నమైన మూవీల్ని చేయటం విశ్వ కథానాయుడు కమల్ హాసన్ కు అలవాటు.
అంతేకాదు.. ఉన్నది ఉన్నట్లుగా ఓపెన్ గా మాట్లాడేస్తారన్న మాట ఆయన గురించి తెలిసిన వారంతా చెబుతుంటారు.
ఆ మధ్యనే రాజకీయ పార్టీని ప్రారంభించినప్పటికీ.. ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోవటం తెలిసిందే.
తాజాగా ఆయన ఒక కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నారు.
అయితే.. ఒక మంచి ఉద్దేశంతోనే ఈ జర్నీని స్టార్ట్ చేయనున్నట్లు చెప్పాలి.
యువతకు ఖాదీని దగ్గర చేయాలని.. నేత కార్మికులకు చేయూతను అందించాలన్న ఉద్దేశంతో ఆయన ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్నారు. ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ అనే ఫ్యాషన్ బ్రాండ్ ను ఆయన షఉరూ చేయనున్నారు.
దేశానికి ఖద్దరు చాలా గర్వకారణమని.. ఏ వాతావరణంలో అయినా దాన్ని ధరించేందుకు అనువుగా ఉండటం దాని ప్రత్యేకతగా ఆయన చెబుతున్నారు.
తాజాగా అడుగు పెట్టిన వ్యాపారానికి సంబంధించిన బ్రాండ్ లాంఛింగ్ కమల్ పుట్టిన రోజైన నవంబరు 7న ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కమల్.. ఆయన కుమార్తె శ్రుతీహాసన్ కు క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేసే అమృతా రామ్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ బ్రాండ్ దుస్తుల డిజైనింగ్ జరుగుతున్నట్లు చెబుతున్నారు.
చికాగో నగరంలో ఈ బ్రాండ్ ను లాంఛ్ చేయాలని భావిస్తున్నారు.
చలికాలంలో వెచ్చగా.. వేసవిలో చల్లగా ఉంచే ఖాదీని మరింతగా చేరువ చేయటానికి వీలుగా.. చేనేత కళాకారుల స్థితిగతుల్ని మార్చాలన్న ఉద్దేశంతో తానీ రంగంలోకి అడుగు పెట్టినట్లుగా చెబుతున్నారు. మరీ.. ఆయనీ వ్యాపారంలో ఏ మేరకు రాణిస్తారో చూడాలి.