ఇల్లినాయిస్ రాష్ట్ర బ్లూమింగ్టన్కు చెందిన కళ్యాణి ముడుంబ ఆసియా & ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ ద్వారా నాలుగు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.
కర్నాటక శాస్త్రీయ సంగీత ప్రదర్శన ద్వారా ఆమె ఈ అరుదైన ఘనత సాధించారు.
మొదటి రెండు ప్రపంచ రికార్డులు గత సంవత్సరం జులై 2023లో “అష్టోత్తర శతసంకీర్తన” కార్యక్రమానికి గానూ, తరువాతి రెండు ప్రపంచ రికార్డులు ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన “సుందర సేతు” శాస్త్రీయ సంగీత కార్యక్రమానికి గానూ గుర్తించి ఆసియా & ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ వారు CARNATIC CONCERT TO RAISE FUNDS FOR THE TALLEST STATUE OF LORD HANUMAN OUTSIDE INDIA విభాగంలో అందజేశారు.
త్రిదండి చిన్నజీయర్ సంకల్పంతో హ్యూస్టన్లో ఏర్పాటు చేస్తున్న 90 అడుగుల అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం Statue of Union నిర్మాణానికి విరాళాలు సేకరించే నిమిత్తం కళ్యాణి ఈ ప్రదర్శనలు ఇచ్చారు.