ఈడీ వస్తే ఏంటి బోడీ వస్తే ఏంటి అని ఈ మధ్యనే మునుగోడు సభలో మాట్లాడారు తెలంగాణ సీఎం కేసీఆర్. తాను తప్పు చేయలేదు కనుక తనను ఎవ్వరూ ఏం చేయలేరు అని కూడా అన్నారు. సరే ! ఆయన తప్పు చేశారా, చేయలేదా అన్నవి అటుంచితే కేసీఆర్ కుమార్తె కవిత మాత్రం తప్పు చేశారనే అంటున్నాయి ఢిల్లీ బీజేపీ వర్గాలు. త్వరలోనే ఆమెపై కేసులు కూడా నమోదు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా అంటున్నాయి. అంటే మద్యం పాలసీలకు సంబంధించి ఆమె కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, ఆప్ తో కలిపి ఆర్థిక నేరాలకు పాల్పడి ఉన్నారన్నది కవిత పై వస్తున్న ఆరోపణలు.
అదేవిధంగా ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందిస్తూ తమను ఎదిరించలేక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము గట్టి పోటీగా వస్తున్నందునే అధినేత కేజ్రీవాల్ పైనా, ఇంకా ఆయన నేతృత్వాన నడుస్తున్న ఢిల్లీ ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తున్నారన్నది ఆప్ నేతల వాదన. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కూడా త్వరలోనే కేసీఆర్ కుటుంబంపై కొన్ని ఆర్థిక నేరాలు నమోదుకు తరువాత వారిని విచారణ చేసేందుకు ఢిల్లీ లో రంగం సిద్ధం అవుతోంది అన్న వాతావరణం నెలకొనిఉంది. అందుకే మునుగోడు సభలో తాము ఎవ్వరికీ తలొగ్గేది లేనేలేదని,తగ్గేదే లేదని కేసీఆర్ అన్నారు. కానీ వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
సొంతంగా ఓ ప్రయివేటు ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి లిక్కర్ డీల్స్ కొన్ని పెట్టుకున్నారని, వీటి విషయమై కవిత వ్యక్తిగత సహాయకుడు కూడా కీలక పాత్ర పోషించారన్నది ఢిల్లీ బీజేపీ చెబుతున్న మాట. ఈ మొత్తం గలాటాలో కవితక్క పీఏతో పాటు ఆమె బంధువు శశాంక్ రెడ్డి కూడా ఉన్నారని వారంటున్నారు. ఒకవేళ ఢిల్లీ బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిజమైతే కవితక్క ఏం చెబుతారు ఏం చేయనున్నారు. నైతికతకు కట్టుబడి కవితక్క రాజీనామా చేస్తారా ?
Comments 1