తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల బ్యాచ్ చేసిన టెలిఫోన్ ట్యాపింగు కుంభకోణంలో అనేక భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నగరంలోని అత్యంత సంపన్నులైన అనేకమంది రాజకీయ ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కాంట్రాక్టర్లు, బిల్డర్లు రియల్టర్లు, సినీనటీనటులు, ఫైనాన్సియర్లు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు, మీడియాసంస్థల అధినేతలు యజమానుల కుటుంబసభ్యులు, ఎడిటర్లు జర్నలిస్టులు కవులు కళాకారుల ఫోన్లను వారి ఇళ్లల్లోని మహిళల టెలిఫోన్లను వాట్సాప్ ఛాటింగులు ఆడియో కాల్స్ ట్యాపింగు చేసి వాటిని రికార్డ్ చేసి వాటి ద్వారా వాళ్లను బ్లాక్ మెయిలింగ్ చేసి, ‘కల్వకుంట్ల గ్యాంగు’ వేలాది కోట్ల రూపాయిలను వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.
చాలామంది తమకు జరిగిన విషయాన్ని బయటకు ఎవరితో చెప్పుకోలేక సతమతమయ్యారని, నిద్రలేనిరాత్రులు గడిపారని, ఆ విషయాలు బయటకు తెలిస్తే కుటుంబాలు కూలిపోతాయని, పరువుమర్యాదలు మంటగలిసి చివరకు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని భయపడి ‘కల్వకుంట్ల గ్యాంగు’కి అడిగినంత కప్పం కట్టారని తెలుస్తోంది,
ఈవిధంగా గత అయిదేళ్లుగా కల్వకుంట్ల దొంగల ముఠా ఏకఛత్రాధిపత్యం వహించిందని అంటున్నారు.
ఈ ట్యాపింగు కుంభకోణం ద్వారా ఆ గ్యాంగు నగరంలో చాలామంది మహిళలను బలవంతంగా లోబరుచుకున్నారని, ఇది దేశంలోనే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన నేరపూరిత చర్య అని, ఇది దేశంలో దావూద్ ఇబ్రహీం మాఫియా లాంటి మరొక అండర్ వరల్డ్ మాఫియా అని, ఇది కూడా దేశంలో అత్యంత మరో పెద్ద కుంభకోణమని అర్థమవుతోంది.
ఈ భయంకర చర్య గురించి వింటుంటేనే వల్లు గగుర్పాటుచెందుతోంది.
రాష్ట్రంలో ఇంతపెద్ద ఎత్తున జరిగిన ఈ అమానుష అనాగరిక ఘోర కిరాతకచర్య గురించి గత ప్రభుత్వంలో పనిచేసిన డీజీపీలకు మరియు ఇతర ముఖ్యశాఖల్లోని పోలీసు ఉన్నతాధికారులకు మరియు కేంద్ర ఇంటెలిజెన్స్ కు ఎవరికీ తెలియదని, వాళ్లంతా సుద్దపూసలని మనం నమ్మితే మనంత ఎర్రిపప్పలు ఇంకెవ్వరూ ఉండరు.
ఇదే కల్వకుంట్ల ముఠా గతంలో, రాష్ట్రప్రభుత్వం చేసిన ‘సకలజనుల సర్వే డేటా’ మొత్తాన్ని కూడా ఇతరదేశాల బహుళజాతిశంస్థలకు అమ్మినట్లు ఆరోపణలున్నాయి.
దీనిమీద తెలంగాణా రాష్ట్రప్రభుత్వం కఠినంగా వ్యవహరించి కుట్రదారులు దోషులు పరోక్షపాత్రదారులు అందరిమీద కఠినచర్యలు తీసుకోవాలి