కళాకారులే కాకుండా కళకి ఆయువు పోసే చేతివృత్తులవారు కొందరుంటారు. మాబు షేక్ అలాంటివారే. నూజివీడు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వీణ తయారి పరిశ్రమని నెలకొల్పిన కార్మికుడు. ఎన్నో వేల వీణలని తాయరు చేస్తూ మరెన్నో వీణలను మరమ్మత్తులు చేస్తున్నవారు. తన శ్రమని, పరిశ్రమని నలుగురికి తెలియచెయటానికి మరియు వెనకపడి ఉన్న పరిశ్రమకి కాస్త చేయూతనివ్వటానికి తానా అధ్వర్యంలో ఫండ్ రైసింగ్ ఈవెంట్ అంతర్జానంలో నిర్వహించబడినది
ఈ కార్యక్రమంలో ప్రముఖ వీణా విద్వాన్ సుధాకర్ రాయప్రోలు గారు, హైదరబాదు నుంచి మరియు శోభా మొక్కపాటి గారు, బెంగుళూరు నుంచి శ్రోతలకి వీనుల విందైన వీణాగానాన్ని, త్యాగరాజు మరియు అన్నమయ్యా కీర్తనలని అందించారు. మాబు షేక్ గారు మాట్లాడుతూ, తను వీణ తయారిని తండ్రి నుంచి ఎలా నేర్చుకున్నది, పలువురి ప్రముఖులకి వీణలను తయారు చేసి ఇచ్చిన విధానాన్ని, వేరే వారికి ఈ విధ్యను నేర్పించాలన్న తన కలని అందరితో ముచ్చటించారు. తనతోనే తన కళ అంతరించిపోకూడదని, పరిశ్రమ నెలకొల్పటానికి పలువురి సహాయం చేయాలని ఆయన విన్నవించారు.
తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి, రీజనల్ కోఆర్డినేటర్స్ రాజా కసుకుర్తి, సుమంత్ రాం, సతిష్ చుండ్రు అధ్వర్యంలొ జరిగిన ఈ కార్యక్రమానికి విజయ నాదెళ్ల, సుధీర్ నారెపలుపు మరియు వెంకట్ సింగు సహాయ సహకారాలతో అంతర్జానంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్య వర్గ సభ్యులు హాజరయ్యారు. తానా ఇలాంటి వాటికి సహాయం చేయటానికి ఎప్పుడూ ముందు ఉంతుంది అని తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజయ చౌదరి లావు ప్రస్తావించారు. తానా కార్యదర్సి రవి పొట్లూరి మాట్లాడుతూ వీణ తయారిదారుడు మాబు షేక్ కి తానా తరుపున లక్ష రుపాయల విరాళాన్ని ప్రకటించారు. కల్చరల్ సమన్వయకర్త సునిల్ పంత్రా కళను ప్రోత్సహించాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఈ కచేరి కి హజరు అయిన అందరికి తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి కృతజ్ఞతలు తెలియచేసారు.