ఏపీ సీఎం జగన్ కు న్యాయవ్యవస్థలపై గౌరవం లేదని కొంతకాలంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణపై గతంలో జగన్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల తనపై ఉన్న క్రిమినల్ కేసుల ప్రొసీడింగ్స్ ను తానే రద్దు చేసుకున్న వ్యవహారంలోనూ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
జగన్కు రాసిన బహిరంగ లేఖలో…మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్స్ అడిగారు. 11 చార్జ్షీట్లలో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ పొందారని, బెయిల్ వచ్చింది కాబట్టి జగన్ న్యాయస్థానాలను మేనేజ్ చేసినట్లేనా అని వెంకట్రావు ప్రశ్నించారు. వివేకాను గొడ్డలితో నరికి చంపారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన కుమార్తె న్యాయంస్థానం తలుపులు తట్టకూడదా అని నిలదీశారు. సునీత న్యాయస్థానానికి వెళ్లడం పరిపాలనకు అడ్డుపడటం ఎలా అవుతుందని నిలదీశారు.
డాక్టర్ సుధాకర్ కేసును సుమోటోగా తీసుకోవడం న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించడం ఎలా అవుతుందని కళా వెంకట్రావు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానుల కోసం భూములను త్యాగం చేసిన రైతులను నిండాముంచి, రాజధానిని ముక్కలు చేసినా కూడా రైతులు కోర్టుకు చెప్పుకోకూడదా అని జగన్ను కళా వెంకట్రావు నిలదీశారు. మరి, ఈ ప్రశ్నలకు జగన్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.