కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గట్టి సవాల్ విసిరారు.
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్… నిన్ను ఓడించక పోతే జిల్లా వదిలి వెళ్ళిపోతానంటూ సవాల్ విసిరారు.
నవీన్ కుమార్ యువతలో బాగా దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో గట్టిగా సంబంధాలు నెరపుతున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన పాదయాత్రకు భారీ స్పందన వచ్చింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడుతూ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ జ్యోతుల నవీన్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. తాజాగా ద్వారంపూడికి నవీన్ కుమార్ విసిరిన సవాల్ బాగా వైరల్ అవుతోంది.
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్…
నీన్ను ఒడించక పోతే జిల్లా వదిలి వెళ్ళిపోతా… #JyothulaNaveenKumar pic.twitter.com/y2YZYPPvo8— Jyothula Nehru (@Nehru_Jyothula) October 23, 2022