హీరోయిన్లు 30 ప్లస్‌లో పడ్డాక గ్లామర్ మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు.
20-25 ఏళ్ల మధ్య కళ్లు చెదిరే అందంతో ఆకట్టుకునే హీరోయిన్లు ఆ తర్వాత ఉన్నట్లుండి గ్లో కోల్పోతుంటారు.
అదే సమయంలో ప్రేక్షకులకు కూడా పాత మొహాల్లా అనిపిస్తాయి.
కొందరు సరైన కేర్ తీసుకోక షేపవుట్ అవుతుంటారు.
పేర్లు అనుకోకూడదు గానీ టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోయిన్లు ఒక వయసు దాటాక ప్రభ కోల్పోయిన ఉదాహరణలు అనేకం.
కానీ తొలి నాళ్లలో ఉన్న ఆకర్షణే పది పదిహేనేళ్ల తర్వాత కొనసాగించడం అతికొద్దిమంది హీరోయిన్లకే సాధ్యమైంది.
30 ప్లస్‌లోకి వచ్చాక కూడా గ్లామర్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు కిక్కిస్తున్న వారిలో కాజల్ అగర్వాల్ కచ్చితంగా ఉంటుంది.
చందమామ, మగధీర సినిమాల్లో అంత మెరిసిపోతుందని ఉద్దేశం కాదు గాని ఇప్పటికే గ్లామర్ పై ఫుల్ కేర్ తీసుకుంటోంది.
తాజాగా మరో పదడుగులు ముందుకేసింది. అవకాశాలు తగ్గాయన్న బెంగ ఏమో మరి… ఏకంగా బరువు తగ్గి అబ్బుర పరిచింది.
బొద్దు కాజల్ ను ఇష్టపడిన వారికి నచ్చకపోవచ్చేమోగానీ గ్లామర్ కోషంట్ స్లిమ్ అవడం వల్ల కాజల్ లో పెరిగిందనే చెప్పాలి.
పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించుకోవడానికి కాజల్ తపన పడుతోంది కదా.