• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాజయ్య వర్సస్ కడియం.. నాయక్ ఎవరు ఖల్ నాయక్ ఎవరు?

admin by admin
August 31, 2022
in Politics, Telangana
2
0
SHARES
84
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇద్దరూ సీనియర్ నేతలే. వీరిద్దరూ అధికార పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ.. ఆయన కోర్ టీంలో సభ్యులుగా ఉండి.. తర్వాతి కాలంలో ఆయన ఆగ్రహానికి గురైన నేతలే. ఇద్దరికి సంబంధించి మరో అంశం ఏమంటే.. ఈ ఇద్దరు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారే కావటం గమనార్హం. అనంతరం ఈ ఇద్దరు నేతలు సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురైన.. పదవులు పోగొట్టుకొని.. గతాన్ని గుర్తుకు తెచ్చుకొని గొప్పగా ఫీలయ్యే వారు.

అలాంటి ఈ ఇద్దరు నేతలు తాజాగా ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు.. ఆరోపణలు.. తిట్లు తీవ్ర ఉద్రిక్తతకు తెర తీయటమే కాదు.. అధికార పార్టీలో కొత్త ముసలానికి తెర తీసినట్లైంది. ఒకరిపై ఒకరు నేరుగా.. సూటిగా.. ఘాటైన విమర్శలు చేసుకున్నారు. తాజా వివాదం ఎక్కడ షురూ అయ్యిందంటే.. సోమవారం జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో ఒక ప్రోగ్రాంకు హాజరయ్యారు రాజయ్య.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 361 మంది అమాయకుల్ని ఎన్ కౌంటర్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కడియంకు తప్పని పరిస్థితిగా మారి.. రాజయ్య మీద అంతే తీవ్రంగా మండపడ్డారు. రాజయ్య ఆరోపణల్ని ఖండించిన కడియం.. అతని కంటే ముందు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రాజయ్య తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ప్రస్తుతం ప్రజల మద్దతు లేని ఆయన మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుున్నారన్నారు.

‘ఆయన చిల్లర.. చిలిపి.. తాగుడు చేష్టలతో పాటు అవినీతి.. కమిషన్లకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని బయటపెడితే రాజ్యయ్య ఒక్కరోజు కూడా బయట తిరగలేరు’ అని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ బర్తరఫ్ అయిన తొలి డిప్యూటీ సీఎం దేశంలోనే ఆయన మొదటివారుగా అభివర్ణించారు. పార్టీ నియమాలకు కట్టుబడి  ఉంటూ ఇంతకాలం విమర్శలు చేస్తున్నా భరిస్తూ ఉన్నానని.. ఇకపై మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రాజయ్యకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇదేనని పేర్కొన్నారు.

తనపై చేసిన వ్యాఖ్యల్ని ఇద్దరు మంత్రులతో పాటు.. హనుమకొండ.. జనగామ జిల్లాల పార్టీ అధ్యక్షులతోనూ మాట్లాడినట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ వద్దకు ఈ ఉదంతాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. మంత్రి కేటీఆర్ కు మరోసారి కరోనా పాజిటివ్ కావటం.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. పార్టీ ఇజ్జత్ ను రోడ్డున పడేసేలా ఉన్న ఈ ఇద్దరు వ్యాఖ్యల విషయంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags: cm kcrcold war in trskadiyam versus rajaiahtrs leader kadiyam sriharitrs leader rajaiah
Previous Post

రూ.9 కోట్లు ఇస్తామన్నా.. అందుకోసం ఆ యాడ్ కు నో

Next Post

ఎన్డీఏలోకి టీడీపీ ఎంట్రీ పక్కా…ఇదే మరో ప్రూఫ్

Related Posts

Top Stories

మార్గదర్శి వ్యవహారంపై స్పందించిన లోకేష్

June 9, 2023
Top Stories

భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్

June 9, 2023
Trending

మంత్రులను ఫుట్ బాల్ ఆడుకునే మ్యాటర్ చెప్పిన చంద్రబాబు

June 9, 2023
Trending

వివేకా కేసులో జగన్, భారతిలకు రఘురామ సూటి ప్రశ్న

June 9, 2023
Trending

మాగుంట రాఘవ్ బెయిల్ రద్దు…సుప్రీం నిర్ణయం

June 9, 2023
lokesh rally
Top Stories

న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్

June 8, 2023
Load More
Next Post

ఎన్డీఏలోకి టీడీపీ ఎంట్రీ పక్కా...ఇదే మరో ప్రూఫ్

Comments 2

  1. Pingback: రాజయ్య వర్సస్ కడియం.. నాయక్ ఎవరు ఖల్ నాయక్ ఎవరు? - TodayNewsHub
  2. 🍓 Deborah just viewed your profile! More info: https://letsg0dancing.page.link/go?hs=f7093eda9ee5f2d5452b64508d3f3fbe& 🍓 says:
    9 months ago

    e3dq82

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మార్గదర్శి వ్యవహారంపై స్పందించిన లోకేష్
  • భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్
  • మంత్రులను ఫుట్ బాల్ ఆడుకునే మ్యాటర్ చెప్పిన చంద్రబాబు
  • వివేకా కేసులో జగన్, భారతిలకు రఘురామ సూటి ప్రశ్న
  • మాగుంట రాఘవ్ బెయిల్ రద్దు…సుప్రీం నిర్ణయం
  • ఆమెను చూసి సాష్టాంగ నమస్కారం పెట్టేసిన స్టార్ హీరో
  • న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్
  • మాగుంట రాఘవకు ఈడీ షాక్..అనూహ్యం
  • టీడీపీ ఇన్చార్జులపై నోరుజారిన కేశినేని నాని
  • అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra