తెలుగుదేశం కార్యకర్తల పార్టీ. ప్రతి కార్యకర్తకు సాహసమే ఊపిరి. ప్రత్యర్థులు నరహంతకులు అవుతారని తెలిసినా వెనక్క తగ్గరు. నిజాలు బయటపెట్టకుండా ఆపరు. ప్రాణం పోగొట్టుకున్నాడు గాని నిజం బట్టబయలు చేయడం కోసం ఓ తెలుగుదేశం కార్యకర్త ప్రాణం పోగొట్టుకున్నాడు.
ఆ కార్యకర్తకు కష్టమొస్తే నాయకత్వం ఎలా అండగా ఉంటుందో లోకేష్ చూపించారు. ప్రొద్దుటూరులో హత్యకు గురయిన సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్ అలా వెళ్లి ఇలా రాలేదు. అక్కడే ఉన్నాడు. నిందితులపై ఎఫ్ఐఆర్ పెట్టేవరకు ఊరుకోలేదు. కుటుంబానికి అండగా నిలిచాడు. చివరికంటా తోడున్నాడు. దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి నివాళులర్పించాను.
అంత్యక్రియల్లో భాగంగా మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. బాధిత కుటుంబాన్ని, సాక్షులని ప్రలోభ పెట్టినా..వారికి ఏం జరిగినా సీఎం జగన్ దే దే బాద్యత. పోలీసులు ఇచ్చిన హామీ మేరకు న్యాయం జరగకపోతే మళ్లీ ప్రొద్దుటూరు వస్తా..మళ్లీ దీక్షకు దిగుతా అని హెచ్చరించారు నారా లోకేష్. ఈ మాత్రం భరోసా ఉంటే పోలీసులు కాదు ఎవరొచ్చినా తెలుగుదేశం కార్యకర్తకు బుల్లెట్ కు గుండెను ఎదురొడ్డుతాడు అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. లోకేష్ వ్యవహరించిన తీరు కార్యకర్తల్లో తిరుగులేని భరోసా నింపింది.
అంత్యక్రియల ఫొటోలిదిగో…