మంత్రి కేటీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సిరిసిల్లలో తన మీద జరిగిన దాడిపై ఫిర్యా దు చేయడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్దామనుకుంటే రెండు రోజులుగా పోలీసులు తనను గృహ నిర్భందం చేశారని మండి పడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుందని.. జోస్యం చెప్పారు.
తెలంగాణలో టీఆర్ ఎస్ గుండాల రాజ్యం నడుస్తోందని పాల్ ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు వారిపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ సాహసించలేదని.. కానీ ఇప్పుడు కేఏ పాల్ వచ్చాడని.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు.
హైదరాబాద్ అమీర్‌పేటలోని తన నివాసంలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లలో తన మీద జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్దామనుకుంటే రెండు రోజులుగా పోలీసులు తనను గృహ నిర్భందం చేశారన్నా రు. రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుందని.. ప్రజలకు కావాల్సిన అన్ని అభివృద్ది పనులు తన వల్లనే సాధ్యమవుతాయని కేఏ పాల్ జోస్యం చెప్పారు. టీఆర్ ఎస్ కావాలా…? ప్రజాశాంతి పార్టీ అభివృద్ది కావాలా..? తేల్చుకుని ఓటు వేయాలని ప్రజలను పాల్ కోరారు.
“ఖబడ్దార్ కేటీఆర్.. నువ్వు ఎవరితో ఫైట్ చేస్తున్నావో అర్థమవుతోందా..? ఎంతో మంది దేశ అధ్యక్షులు మోకరిల్లిన నా మీద నువ్వు దాడి చేయించావు. డీజీపీని కలుద్దామంటే.. కలవనివ్వట్లేదు. నన్ను రెండు రోజులుగా గృహనిర్భందం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశాను. ఇక డీజీపీని కలవను. ఇప్పుడే ఇంతగా గుండా రాజ్యం ఉందంటే.. ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇంకెంత అరాచకం రాజ్యమేలుతుందో చూడండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా.. తండ్రీ కొడుకులిద్దరూ చిత్తుచిత్తుగా ఓడిపోవటం ఖాయం. అభివృద్ధి కావాలంటే కేఏ పాల్.. అరాచక పాలన కావాలంటే కేటీఆర్.. ఇక ప్రజలే ఆలోచించుకోవాలి.“ అని పాల్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని పాల్ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తనపై సిరిసిల్ల ఎస్పీ సహాయంతో దాడికి ప్లాన్ చేశారని ఆరోపించారు. తాను డీజీపీని కలుస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రెండు రోజులుగా తనను డీజీపీని కలవకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ వేయబోతున్నానని కేఏ పాల్ చెప్పారు. దీంతో పాల్ వ్యవహారం.. మరింత ముదురుతున్నట్టే కనిపిస్తోంది.