భార్యా వియోగాన్ని భర్త.. భర్త వియోగాన్ని భార్య తట్టుకోవడం చాలా కష్టం అంటారు. అందులోనూ కాస్త వయసు పెరిగాక అన్నేళ్ల పాటు తోడుగా ఉన్న వ్యక్తి చనిపోతే కుంగుబాటుకు గురై కొన్నేళ్లలోనే మరణించిన ఉదంతాలు చూస్తుంటాం.
కాగా ఇప్పుడు టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ కుటుంబంలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ఈ నెల రెండో తారీఖున విశ్వనాథ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణించిన మూడు వారాలు తిరిగేసరికే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు. ఆమె వయసు 86 ఏళ్లు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో జయలక్ష్మి కన్నుమూశారు.
భర్త మరణించే సమయానికి జయలక్ష్మి కూడా కొంచెం అనారోగ్యంతో ఉన్నుట్లు. విశ్వనాథ్ వెళ్లిపోయాక ఆ బాధలోనే ఆమె గుండెపోటుకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. విశ్వనాథ్‌కు తక్కువ వయసులోనే జయలక్ష్మితో పెళ్లయింది. విశ్వనాథ్ కంటే ఆమె ఆరేళ్లు చిన్నది. చాలా అన్యో న్యమైన జంటగా విశ్వనాథ్-జయలక్ష్మిలకు ఇండస్ట్రీలో పేరుంది.
పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అయిన ఆయన.. సినిమాల నుంచి నిష్క్రమించాక ఆయన ఇంటి నుంచి ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూల్లో పక్కన జయలక్ష్మి కనిపించేవారు. విశ్వనాథ్, జయలక్ష్మిలకు ఇద్దరు కుమారులు. వాళ్లు సినిమా రంగం వైపు రాలేదు. వేరే రంగాల్లో స్థిరపడ్డారు.
Legendary Director K Viswanath gari wife Jayalakshmi (86) Garu passed away due to illness.
Om Shanthi pic.twitter.com/zdGsJ3tVV7
— Vamsi Kaka (@vamsikaka) February 26, 2023