తెలుగు నాట సుపరిచితమైన సీరియల్స్ లో గుప్పెండతమనసు ఒకటి. ఏళ్లుగా సా..గుతున్న ఈ సీరియల్ ను విసుగు చెందకుండా ఫాలో అవుతుంటారు. మిగిలిన సీరియల్స్ తో పోలిస్తే.. ఇందులో ఎమోషన్ డ్రామా కాస్త అలరిస్తూ ఉంటుంది. ఈ సీరియల్ తో తెలుగువారికి బాగా పాపులర్ అయిన నటి జ్యోతిరాయ్. జగతిగా.. రిషి తల్లిగా నటించిన జ్యోతిరాయ్ ఇప్పటికే కన్నడ నాట సీరియల్ నటిగా పాపులర్. పెళ్లైన ఆమెకు ఒక బాబు ఉన్నాడు.
తాజాగా ఒక యువ దర్శకుడితో ఆమె రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు శాండల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వాదనకు బలం చేకూరేలా వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయటం.. దానికి స్పందిస్తూ సీరియల్ నటి సుజాత శుభాకాంక్షలు చెప్పిన వైనంతో వీరిద్దరి మధ్య ఉన్న లవ్ విషయం బయటకు వచ్చేసింది.
తాజాగా వీరిద్దరున్న ఫోటోకు నటి సుజాత కామెంట్ చేస్తూ.. ‘‘లవ్ లవ్ అండ్ లవ్. యూ బోత్.. కీప్ రాకింగ్ ఆల్వేస్’ అని పేర్కొంటే అందుకు స్పందించిన జ్యోతిరాయ్.. ‘థ్యాంక్యూ డియర్’ అంటూ రిప్లై ఇవ్వటంతో వీరిద్దరి మధ్య బంధం స్పెషల్ అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లైన వారు ప్రేమలో పడటం మామూలే కదా? అన్న సందేహం రావొచ్చు. ఇక్కడ జ్యోతిరాయ్ తన భర్తకు అధికారికంగా విడాకులు ఇవ్వకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇరవై ఏళ్ల వయసులో జ్యోతిరాయ్ కు పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లైంది. నిజానికి జ్యోతి నటి కావటానికి ఆయనే కారణమని చెబుతారు. కర్ణాటకలోని మడికేరిలో పుట్టిన జ్యోతిరాయ్ మంగళూరులో చదువుకుంది. విను బలాంజ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన జ్యోతి.. ఇప్పటికి పలు సీరియల్స్ లో నటించి పాపులర్ నటిగా పేరుంది. అనంతరం సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్న ఆమె.. యువ దర్శకుడు పుర్వాజ్ అలియాస్ సురేశ్ కుమార్ తో ఉన్న రిలేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.