సోమవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ ముందుకు స్టేట్ గవర్నమెంట్ పిటిషన్.
సుప్రీం కోర్టు కేసు విచారణకు లిస్ట్ అయిన పిటిషన్
పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ
ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చిచెప్పిన సీఎస్
ఎస్ఈసీ నిర్ణయం పునఃపరిశీలించాలని సీఎస్ వినతి
సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరిన సీఎస్
ఎస్ఈసీ కోరినట్లుగా అధికారులను తొలగించడం సాధ్యం కాదన్న సీఎస్
ఎస్ఈసీ తొలగించిన అధికారులు కరోనా విధుల్లో ఉన్నవారన్న సీఎస్
ఎస్ఈసీ, ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిందన్న సీఎస్
కరోనా మొదటి డోస్ తీసుకున్న వారికి రెండోడోస్ ఇచ్చిన నాలుగు వారాలకు ఇమ్యూనిటీ వస్తుందన్న సీఎస్
పోలింగ్, వ్యాక్సినేషన్ రెండూ ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదన్న సీఎస్
పోలింగ్, వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి జరగాలంటే వ్యాక్సినేషన్ వాయిదా వేయాల్సి వస్తుందన్న సీఎస్
హైకోర్టు ఉత్తర్వులను మనస్ఫూర్తిగా పాటించేందుకు ఎస్ఈసీ, ప్రభుత్వం ప్రయత్నించాలన్న సీఎస్
ఎస్ఈసీకి చెప్పిన విషయాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీలో ఉన్నాయన్న సీఎస్
సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగాలని ఎస్ఈసీని కోరిన సీఎస్
సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎస్ఈసీని కోరిన సీఎస్