తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. గత బీఆర్ ఎస్ హయాంలో ఎన్నిక లకు ముందు.. రాస్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయం వెలుగు చూసిన నేపథ్యంలో దీనిని మరింత లోతుగా విచారిస్తున్నా రు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను కూడా విచారించారు. దీనిలో సీఎం కేసీఆర్ పాత్ర ఉందని కూడా తేటతెల్లమైంది. అయితే.. అసలు ఈ కేసు వెలుగులోకి రావడానికి ప్రధాన కారణమైన.. అప్పటి ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం.. తాజాగా వెలుగు చూసింది. అప్పట్లో హార్డ్ డిస్కులను ధ్వంసం చేస్తున్న సమయంలో ప్రణీత్ రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తర్వాత.. ఈ కేసులో మూలాలపై అధికారులు దృష్టి పెట్టడం.. చాలా మందిని అరె్స్టు చేయడం కూడా తెలిసిందే. ఇక, ఇప్పుడు ప్రణీత్ రావు వ్యవహారంలో పోలీసులు రాబట్టిన వాంగ్మూలం తాజాగా వెలుగు చూసింది. తాము ప్రభుత్వం సూచనల మేరకే ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆయన తెలిపారు. ఈ క్రమంలో `కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాఫ్ట్వేర్` సాయంతో ట్యాపింగ్‌కు పాల్పడినట్టు చెప్పారు. లాయర్లు, న్యాయమూర్తులు, కొన్ని పత్రికల ఎడిటర్లు, పాత్రికేయులు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు వివరించారు.
ప్రధానంగా ఎన్నికల సమయంలో డబ్బులు బదిలీ కాకుండా నిలువరించేందుకు చర్యలు చేపట్టినట్టు ప్రణీత్ రావు వివరించారు. మొత్తంగా 1200మందికిపైగానే లిస్టు తమకు అందిందని.. దాని ప్రకారం తాము ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టినట్టు చెప్పారు. ఏయే మార్గాల్లో వారికి ఎన్నికల నిధులు అందుతున్నాయి? ఎవరు ఇస్తున్నారు? అనే విషయాలపై దృస్టి పెట్టి.. ఆ నిధులు అందకుండా అడ్డుకున్నట్టు తెలిపారు. తాము ట్యాపింగ్ చేసిన వారిలో ప్రతిపక్ష నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారులు, కొందరు పాత్రికేయులు, రెండు మీడియా సంస్థల అధిపతులు కూడా ఉన్నారని తెలిపారు.
ట్యాపింగ్ కోసం సిబ్బంది!
+ తాము చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం 60 మంది సిబ్బందిని వినియోగించుకున్నట్టు ప్రణీత్ రావు తెలిపారు.
+ అదేవిధంగా 17 కంప్యూటర్లు వినియోగించారు. అనంతరం వాటిలో సగం ధ్వంసం చేశారు.
+ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేశారు.
+ సీడీఆర్, ఐడీపీఆర్ డేటా మొత్తం కాల్చేశారు.
+ పార్మాట్ చేసిన ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశారు.
+ రికార్డులు పూర్తిగా ధ్వంసం చేశారు.
+ ధ్వంసం చేసిన ఆధారాలను నాగోలు, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేశారు.